మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధం చేయాలి

ABN , First Publish Date - 2021-02-25T03:57:52+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్వం సి ద్ధం చేయాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ అన్నారు.

మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధం చేయాలి

కలెక్టర్‌ పోలా భాస్కర్‌

మార్కాపురం, ఫిబ్రవరి 24 : మున్సిపల్‌ ఎన్నికల లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్వం సి ద్ధం చేయాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ అన్నారు. స్థా నిక ఎస్వీకేపీ డిగ్రీ కళాశాలలో బాలెట్‌ బాక్స్‌లను భద్రపరిచే స్ట్రాంగ్‌ రూములను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ భాస్కర్‌ మా ట్లాడుతూ ఎన్నికల సామగ్రి పంపిణీ మొదలుకొని తిరిగి సిబ్బంది నుంచి స్వీకరించేవరకూ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ జే.వీ.మురళి, ఆర్డీవో ఎం.శేషిరెడ్డి, తహసీల్దా ర్‌ విద్యాసాగరుడు, కమిషనర్‌ నయీమ్‌ అహమ్మద్‌, డీఈ సు భానీ, బీఐ వెంకటేశ్వర్లు  పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-25T03:57:52+05:30 IST