నిన్న మున్సిపల్‌...నేడు పోలీస్‌

ABN , First Publish Date - 2021-06-18T06:00:22+05:30 IST

జగిత్యాలపై అవినీతి నిరోదక శాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. జిల్లా కేంద్రంలో వరస దాడులకు ఏసీబీ అధికారులు పాల్పడుతుండడం కలకలం రేపుతోంది.

నిన్న మున్సిపల్‌...నేడు పోలీస్‌
రెవెన్యూ విభాగంలో సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు

 జగిత్యాలలో ఏసీబీ అధికారుల వరుస దాడులు

- చిక్కుతున్న అవినీతి చేపలు

- ఉద్యోగ వర్గాల్లో హడల్‌

జగిత్యాల, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి) : జగిత్యాలపై అవినీతి నిరోదక శాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. జిల్లా కేంద్రంలో వరస దాడులకు ఏసీబీ అధికారులు పాల్పడుతుండడం కలకలం రేపుతోంది. నిన్న మున్సిపల్‌ కార్యాలయంపై దాడి జరిపి రెవెన్యూ విభాగంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై విచారణ జరుపుతున్న ఏసీబీ అధికారు లు తాజాగా పోలీసు శాఖపై దృష్టి సారించి ఏకంగా సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ స్థాయి అధికారిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అవినీతి, అక్రమాలపై ఏసీబీ అధికారులు పకడ్బందిగా దృష్టి సారిస్తుండడం జిల్లాలో ఉద్యోగ వర్గాల్లో హడలెత్తిస్తోంది. గడిచిన నాలుగు నెలల కాలంలో మూడు పర్యాయాలు ఏసీబీ అధికారులు జిల్లా కేంద్రంలో సోదాలు నిర్వహించ డం, పలువురు అవినీతి అధికారులు, ఉద్యోగులను పట్టుకోవడం చర్చనీ యాంశంగా మారింది.

నిన్న మున్సిపల్‌...నేడు పోలీసు

జగిత్యాల మున్సిపల్‌లో గల టౌన్‌ ప్లానింగ్‌ విభాగం, రెవెన్యూ విభాగా ల్లో ఏసీబీ అధికారులు రెండు పర్యాయాలు దాడులు జరిపారు. సుమారు  నాలుగు నెలల క్రితం మున్సిపల్‌లో సోదాలు జరిపి టౌన్‌ ప్లానింగ్‌ విభా గానికి చెందిన పలువురు ఉద్యోగులను లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండడ్‌గా పట్టుకున్నారు. మున్సిపల్‌లో ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వడానికి డబ్బులు డిమాండ్‌ చేయడంతో ఓ ప్రైవేటు వైద్యుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 9న ఏసీబీ అధికారులు జగిత్యాల బల్దియాపై దాడులు జరిపారు. జగిత్యాల మున్సిపల్‌లో సోదాలు నిర్వహించి రూ. 95 వేలు లంచం తీసుకుంటుండగా ఇరువురు టౌన్‌ ప్లానింగ్‌ ఉద్యోగులు, ఒక లైసెన్స్‌డ్‌ ఇంజనీర్‌ను పట్టుకున్నారు. ఈఘటనలో బాధ్యులయిన రాముతో పాటు లైసెన్స్‌డ్‌ ఇంజనీర్‌ నాగరాజు, టౌన్‌ ప్లానింగ్‌ సిటి ప్లాన ర్‌ పిట్టల బాలనందస్వామిలను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. నాలుగు రోజుల క్రితం మున్సిపల్‌లోని రెవెన్యూ విభాగంలోని ఉద్యోగుల అవినీతి, అక్రమాల ఫిర్యాదులపై ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. మ్యుటేషన్‌ సందర్భంగా అక్రమాలు, అవినీతి జరుగుతున్నాయన్న అనుమానాలతో మున్సిపల్‌ కమిషనర్‌ మారుతి ప్రసాద్‌తో పాటు మేనేజర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, రెవెన్యూ విభాగం సీనియర్‌ అసిస్టెంట్‌ అనూప్‌, బిల్‌ కలెక్టర్‌ అనిల్‌లను విచారించారు. ఈ ఘటనలో ఏసీబీ నివేదిక మేరకు సీనియర్‌ అసిస్టెంట్‌ అనూప్‌, బిల్‌ కలెక్టర్‌ అనిల్‌లను మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఉన్నతాధికా రులు సస్పెండ్‌ చేశారు. తాజాగా జగిత్యాల పట్టణ పోలీస్‌ స్టేషన్‌పై ఏసీబీ అధికారులు దాడులు జరిగాయి. జగిత్యాల ఠాణాలో నమోదైన  అ దనపు వరకట్నం వేధింపుల కేసులో రూ. 50వేల లంచం డిమాండ్‌ చేసి రూ. 30 వేలు తీసుకుంటుండగా జగిత్యాల టౌన్‌ ఎస్సై శివకృష్ణతో పాటు అతని ప్రైవేటు డ్రైవర్‌ కడప రవిలు ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

వామ్మో ఏసీబీ....

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారులు వరస దాడులకు పాల్ప డుతుండడంతో ఉద్యోగ వర్గాలు బెంబేలెత్తుతున్నాయి. ఉద్యోగుల్లో ఏసీబీ అంటే హడలెత్తే పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగు నెలల కాలంలో మూడు పర్యాయాలు ఏసీబీ దాడులు చేయడం పలువురు అధికారులు, ఉద్యోగులను పట్టుకోవడంతో లంచగొండి అధికారుల్లో ఆందోళన నెలకొం ది. జిల్లాలో పలు ప్రభుత్వ శాఖల్లో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతు న్నాయి. ప్రతి పనికి పైసలు డిమాండ్‌ చేస్తున్నారు. పలు సందర్భాల్లో అడిగినంత డబ్బులు ఇచ్చి గుట్టుచప్పుడుకాకుండా పనిచేయించుకుంటు న్నారు. మరికొన్ని సందర్బాల్లో లంచం డబ్బులు ఇష్టారీతిగా డిమాండ్‌ చేయడం, పనులు పూర్తి చేయడానికి వేధింపులకు పాల్పడడం, అనవసర జాప్యం చేయడం వంటి కారణాల వల్ల బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. బాధితులు ఏసీబీని ఆశ్రయించి పట్టుబడే విధంగా చేస్తున్నారంటే ఆయా ప్రభుత్వ శాఖలో చోటుచేసుకున్న అవినీతికి అద్దం పడుతోంది.

గతి తప్పుతున్న అధికారుల తీరు..

ఓ వైపు పారదర్శకమైన పరిపాలన జరపాలని ఉన్నతాధికారులు ఆదే శాలు జారీ చేస్తున్న జగిత్యాల జిల్లాలో పలువురు అధికారుల తీరు గతి తప్పుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పలువురు అధికారులు పైసలు ఇ వ్వనిదే పనులు చేయడం లేదు. ప్రధానంగా మున్సిపల్‌, పోలీసు శాఖ లతో పాటు వివిధ శాఖల్లో సైతం అవినీతి చోటుచేసుకుంటున్నట్లు ఆరో పణలు వస్తున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడం, ప్రజా ప్ర తినిధులు పట్టించుకోవడం వంటి కారణాల వల్ల కార్యాలయాల్లో అధి కారులు, ఉద్యోగులు ఆడింది ఆట పాడింది పాటగా తయారయింది. అవి నీతి, అక్రమాలను అరికట్టడానికి ఉన్నతాధికారులు పకడ్భందిగా దృష్టి సారించాల్సిన అవసరముంది. 


Updated Date - 2021-06-18T06:00:22+05:30 IST