అక్రమ కట్టడాలపై కలెక్టర్‌ ఆగ్రహం

ABN , First Publish Date - 2020-02-28T10:51:36+05:30 IST

అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో పుట్టగొడుగుల్లా కొనసాగుతున్న అక్రమ కట్టడాలపై కలెక్టర్‌ హన్మంతరావు భగ్గుమన్నారు.

అక్రమ కట్టడాలపై కలెక్టర్‌ ఆగ్రహం

పటాన్‌చెరు, ఫిబ్రవరి 27 : అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో పుట్టగొడుగుల్లా కొనసాగుతున్న అక్రమ కట్టడాలపై కలెక్టర్‌ హన్మంతరావు భగ్గుమన్నారు. పట్టణ ప్రగతిపై గురువారం మున్సిపల్‌ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అక్రమ కట్టడాలను నియంత్రించడంలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారు. అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కమిషనర్‌ను ఆదేశించారు. అక్రమ కట్డడాలను గుర్తించి నోటీసులు జారీ చేసి కూల్చివేతకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ రాజర్షిషా, తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, కమిషనర్‌ సుజాత, ప్రత్యేక అఽధికారి కేషూరాం పాల్గొన్నారు.

Updated Date - 2020-02-28T10:51:36+05:30 IST