మున్సిపాలిటీల్లో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్‌ రవి

ABN , First Publish Date - 2020-02-28T11:46:41+05:30 IST

మున్సిపాలిటీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్‌ జి.రవి అన్నారు. పట్టణ ప్రగతిపై ఐదు మున్సి పాలిటీల కమిషనర్లతో గురువారం కలెక్టరేట్‌

మున్సిపాలిటీల్లో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్‌ రవి

జగిత్యాల, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్‌ జి.రవి అన్నారు. పట్టణ ప్రగతిపై ఐదు మున్సి పాలిటీల కమిషనర్లతో గురువారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ము న్సిపాలిటీల్లోని ఒక్కో వార్డు వారీగా నిరక్ష రాస్యులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చి దిద్దాలని అన్నారు. పట్టణ ప్రగతిలో చేపట్టిన ప్రతి పని వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. మున్సిపాలిటీల్లో చెత్త సేకరణ కోసం కావాల్సిన ఆటోలను సమకూర్చుకో వాలన్నారు. పట్టణ ప్రగతిలో ఐదు వార్డులకు ఒక సూపర్‌వైజర్‌ను నియమించామని, వీరం తా నిత్యం సమస్యలను తెలుసుకుని పరిష్క రించేలా చూడాలన్నారు. మున్సిపాలిటీలకు సంబంధించి బడ్జెట్‌ ప్రతిపాదనలను త్వరగా రూపొందించుకోవాలని ఆదేశాలు జారీ చేశా రు. పార్క్‌లలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలన్నారు. డంపింగ్‌ యార్డుల కోసం స్థలాలను కేటాయించడం జరిగిందని, ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తహసీల్దార్లతో కలిసి పరిష్కరించుకోవాలని అన్నారు. అనుమతులు లేని ఫ్లాట్లను గుర్తించే బాధ్యత కమిషనర్ల దేనని అన్నారు. శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించి లేబర్‌ కొరతను అధిగమించాలని అన్నారు. పట్టణ ప్రగతిలో రోడ్లు, డ్రైనేజీ, రోడ్డుపై మట్టి లేకుండా చెత్తాచెదారం లేకుండా అన్ని వార్డులను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్‌ బి.రాజేశం మా ట్లాడుతూ మున్సిపల్‌ పరిధిలో చిన్న చిన్న పార్క్‌లలో చెత్తాచెదారం పూర్తిగా తొలగించా లని, పబ్లిక్‌ టాయిలెట్లు ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకోవాలన్నారు. పెట్రోల్‌ బంక్‌ల వద్ద ఏర్పాటు చేసిన టాయిలెట్లు ఉపయోగంలో ఉన్నాయో, లేవో తనిఖీ చేయాలన్నారు. ప్రతి నర్సరీలో సర్వే డిమాండ్‌ ప్రకారం మొక్కలు పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. నాటిన మొక్కల రక్షణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. మొక్కల సంరక్షణకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. పారిశుధ్య పనులపై మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి పన్నును మార్చి 31లోగా నూటికి నూరు శాతం వసూలు చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌వో అరుణశ్రీ, జడ్పీ సీఈవో శ్రీనివాస్‌, ఆర్‌ అండ్‌ బీ ఈఈ శ్రీనివాస్‌, డీఆర్‌డీఏ పీడీ లక్ష్మీ నారాయణ, మైనార్టీ వెల్ఫేర్‌ అధికారి సుందర వరదరాజన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-28T11:46:41+05:30 IST