Abn logo
Sep 19 2021 @ 01:01AM

103వ ఐఈఏ అధ్యక్షుడిగా మునిరత్నం నాయుడు

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), సెప్టెంబరు 18: రాజస్థాన్‌ రాష్ట్రంలోని జైపూర్‌లో ఈ ఏడాది డిసెంబరులో నిర్వహించే 103వ ఇండియన్‌ ఎకనమిక్‌ అసోసియేషన్‌ (ఐఈఏ) వార్షిక సదస్సు అధ్యక్షుడిగా ఎస్వీయూ ఎకనమిక్స్‌ విభాగ రిటైర్డు ప్రొఫెసర్‌ కె.మునిరత్నం నాయుడు నియమితుల య్యారు. 1995లో ఎస్వీయూ ఎకనమిక్స్‌ విభాగ ప్రొఫెసర్‌గా రిటైరైన ఈయన 1970లో ఐఏఈ సభ్యత్వాన్ని పొందారు. ఎస్వీయూ అనుబంధ కర్నూలు పీజీ సెంటర్‌ ప్రత్యేకాధికారిగా, సీడీసీ డీన్‌గా, డీడీఈ డైరెక్టర్‌గా పనిచేశారు. మైసూరు యూనివర్సిటీలో లెక్చరర్‌, రీడర్‌గా పనిచేశారు. 10 పుస్తకాలు, 250 పరిశోధనా వ్యాసాలు రాశారు. ఈయన పర్యవేక్షణలో 10 పీహెచ్‌డీలు, ఐదు ఎంఫిల్‌ పూర్తయ్యాయి. వీరి కృషికి గుర్తింపుగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అవార్డును పొందారు. గతంలో ఎస్వీయూ ఎకనమిక్స్‌ విభాగ ప్రొఫెసర్‌ డీఎల్‌ నారాయణ 1985లో ఐఈఏ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఎస్వీయూ నుంచి ఈ పదవి పొందిన రెండో వ్యక్తిగా మునిరత్నం నాయుడు నిలిచారు.