వద్దని చెప్పినా విననందుకే హత్య

ABN , First Publish Date - 2021-06-04T04:42:19+05:30 IST

తన తల్లితో వివాహేతర సంబంఽ దం మానుకోవాలని చెప్పినా విననందుకే ప్రియుడిని హతమార్చాడు ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం తూటికుంట్లకు చెందిన 17ఏళ్ల బాలుడు.

వద్దని చెప్పినా విననందుకే హత్య
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏసీపీ సత్యనారాయణ

 స్నేహితుల సహకారంతో మర్డర్‌  

తూటికుంట్ల హత్య ఘటనలో ఆరుగురు అరెస్టు

 వివరాలు వెల్లడించిన వైరా ఏసీపీ సత్యనారాయణ

బోనకల్‌, జూన్‌ 3: తన తల్లితో వివాహేతర సంబంఽ దం మానుకోవాలని చెప్పినా విననందుకే ప్రియుడిని హతమార్చాడు ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం తూటికుంట్లకు చెందిన 17ఏళ్ల బాలుడు. గతనెల 29న జరిగిన ఈ హత్య ఘటనకు సంబంధించిన వివరాలను వైరా ఏసీపీ సత్యనారాయణ గురువారం బోనకల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఘటనకు పాల్పడిన ఆరుగురిని అరెస్టు చేశామని ఆయన తెలిపారు. సదరు బాలుడి తల్లికి, అదే గ్రామానికి చెందిన ఉపేందర్‌(23) అనేయువకుడికి వివాహేతర సంబంధం ఉండగా.. ఇదే విషయం తెలిసి ఆ బాలుడి తండ్రి రెండున్నరేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనోవేదనలో ఉన్న బాలుడు.. వివాహేతర సంబంధం మానుకోవా లని ఉపేందర్‌, తల్లిని మందలిస్తూ వస్తున్నాడు. తల్లితో తరచూ గొడవకు దిగుతున్నాడు. అయినా వారిలో మార్పు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఉపేందర్‌.. ఈ సమస్యకు పరిష్కారం ఉపేందర్‌ను అడ్డుతొలగిస్తేనే దొరుకుతుందని భావిం చాడు. అయితే తన స్నేహితులతో కలిసి రోజూ ఓ ఇంటి డాబాపై నిద్రించేక్రమంలో తనలోని బాధను స్నేహితులతో పంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మద్యం, జూదానికి బానిసైన సదరు యువకుడు.. గత నెల 29న తెల్లవారుజామున 4గంటల సమయంలో ఉపేందర్‌ నిద్రిస్తున్న డాబాపైకి మరో స్నేహితుడితో కలిసి వెళ్లాడు. స్నేహితుడు కాళ్లు పట్టుకోగా.. బాలుడు తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో ఉపేందర్‌ ఛాతి, గొంతుపై నరకడంతో ఉపేందర్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. అయితే హత్య చేసే సమయంలో ముందుగానే గొడ్డలిని దేవాలయం దగ్గర దాచారు. నలుగురు స్నేహితులను దూరంగా ఒక్కొక్కరిని నాలుగు వైపులా కాపాలా ఉంచాడు. ఎవరైనా వస్తే ఈల వేసి అప్రమత్తం చేయాలని సందేశాన్ని ఇచ్చాడు. అందరూ గాఢ నిద్రలో ఉన్న తర్వాత ఆ గొడ్డలిని తీసుకుని ఉపేందర్‌ ఇంటి డాబాపైకి చేరుకుని ఉపేందర్‌ను హతమార్చారు. అయితే హత్యానంతరం గొడ్డలితో నరికిన బాలుడు మాత్రమే గ్రా మంలో ఉండగా.. మిగిలిన వారు పరారయ్యారు. వారు గురువారం గ్రామంలోకి వచ్చినట్టు సమాచారం అం దడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. హ త్య ఘటనలో ఆరుగురి పై నేరం మోపగా అందులో న లుగురు మైనర్లు, ఇద్దరు మేజర్లున్నారు. మేజర్లుగా ఉన్న గరిడేపల్లి నాగరాజు, సంగాపు విక్రంలను మధిర కోర్టుకు, మైనర్లను ఖమ్మంలోని జువెనైల్‌ జస్టిస్‌ ముందు హాజ రుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్టు తెలిపారు. వీరిపై సెక్షన్‌ 302, 120(బి) కింద కేసు నమోదు చేశారు. ఈ సమావేశంలో మధిర సీఐ మురళి, ఎస్‌ఐ కొండలరావు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-04T04:42:19+05:30 IST