Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉద్యోగానికి వెళ్లిన భార్య అర్ధరాత్రైనా ఇంటికి రాకపోవడంతో.. కేసు పెట్టిన భర్త.. చివరికి భార్య ఎక్కడ ఉందో తెలిసి..

ఇంటర్నెట్ డెస్క్: ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఉద్యోగానికని వెళ్లిన భార్య అర్థరాత్రైనా ఇంటికి రాలేదు. దీంతో కంగారుపడ్డ భర్త.. తన భార్య‌తోపాటు కంపెనీలో పని చేస్తున్న ఇతర ఉద్యోగాలను ఆరా తీశాడు. అయినా ఫలితం లేకపోయింది. తన భార్య జాడ దొరకలేదు. రాత్రంతా భార్య కోసం ఎదురు చూస్తూ.. తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు. ఏదో శబ్దంతో ఉలికిపడుతూ లేచిన భర్త.. తన భార్య ఇంకా ఇంటికి చేరుకోలేదని గ్రహించాడు. ఆయన మనసు కీడు శంకించింది. లోలోపల భయపడూనే పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న అధికారులు.. దర్యాప్తు చేశారు. అనంతరం పోలీసులు ఆమె జాడను కనిపెట్టారు. ఈ నేపథ్యంలో భార్య ఎక్కడ ఉందో తెలుసుకుని ఆ భర్త ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. రాజస్థాన్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 


రాజస్థాన్‌లోని బాన్స్కో ప్రాంతంలో ఇద్దరు దంపతులు నివసిస్తున్నారు. ఆమెకు 60ఏళ్లు.. ఆయనకు 65ఏళ్లు. ఇంత వయసొచ్చినా రెక్కల కష్టాన్నే నమ్ముకుని ఆ దంపతులు జీవుస్తున్నారు. ఆమె వయసు 60ఏళ్లు అయినప్పటికీ స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో ఉద్యోగానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎప్పటిలాగే ఆమె గత శనివారం ఉద్యోగానికి వెళ్లారు. కాగా.. సాయంత్రం 6 గంటలకే విధులు ముగించుకుని ఇంటికి బయల్దేరే ఆమె.. ఆ రోజు అర్ధరాత్రైనా ఇంటికి రాలేదు. ఈ క్రమంలో కంగారుపడ్డ భర్త ఆమె సహోద్యోగులను సంప్రదించారు. అయినప్పటికీ భార్యకు సంబంధించిన సమాచారం తెలియకపోవడంతో.. రాత్రంతా ఎదురు చూస్తూ తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నారు. ఈ క్రమంలోనే తెల్లారింది. భార్య ఇంకా ఇంటికి రాలేదని గుర్తించిన ఆయన పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. కొద్ది దూరంలో మహిళ మృతదేహం ఉందని సమాచారం రావడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఆ భర్తకు కూడా సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న భర్త.. ముఖం గుర్తుపట్టరానంత దారుణ స్థితిలో ఒంటిపై నూలు పోగులేకుండా విఘత జీవిగా పడి ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. బోరున విలపిస్తూ అక్కడే కుప్పకూలిపోయాడు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమెతో పని చేసే ఉద్యోగులో లేక మరొకరో ఆమెపై అత్యాచారం చేసి, ఆ తర్వాత చంపేసి, శవాన్ని అడవిలో పడేసి ఉండొచ్చని భావిస్తూ విచారణ చేపట్టారు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement