Lakhimpur Kheri: ఘటనలో కేంద్రమంత్రి కుమారుడు, ఇతరులపై హత్య కేసు

ABN , First Publish Date - 2021-10-04T14:25:37+05:30 IST

ఉత్తర ప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరిలో నిరసన తెలుపుతున్న రైతులపై కారు నడిపారన్న ఆరోపణలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాపై హత్య కేసు నమోదైంది...

Lakhimpur Kheri: ఘటనలో కేంద్రమంత్రి కుమారుడు, ఇతరులపై హత్య కేసు

లక్నో: ఉత్తర ప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరిలో నిరసన తెలుపుతున్న రైతులపై కారు నడిపారన్న ఆరోపణలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాపై హత్య కేసు నమోదైంది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) లో అనేక ఇతర వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి. ఈ ఘటనలో మరణించిన ఎనిమిది మందిలో నలుగురు రైతులు ఉన్నారు.ఆశిష్ మిశ్రాను తీసుకెళ్తున్న కారు నిరసనకారుల గుంపుపైకి దూసుకెళ్లినట్లు రైతు సంఘాలు పేర్కొన్నాయి. 


ఆశిష్ మిశ్రాతోపాటు ఈ సంఘటనలో పాల్గొన్న వారందరిపై హత్య కేసు నమోదు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. కేంద్ర మంత్రివర్గం నుంచి అజయ్ మిశ్రాను తొలగించాలని కూడా రైతు సంఘం కోరింది. టికోనియా పోలీసులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాపై కేసు  నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.యూపీలోని లఖింపూర్ ఖేరీలో ఘోరమైన ఘర్షణ నేపథ్యంలో పంజాబ్‌లో హై అలర్ట్ ప్రకటించారు


Updated Date - 2021-10-04T14:25:37+05:30 IST