Abn logo
Sep 26 2021 @ 07:33AM

రాత్రంతా ఇంట్లోనే చదువుకున్నాడు.. తెల్లారేసరికి కిలోమీటరు దూరంలో శవంలా కనిపించాడు.... ఇంతలోనే ఏం జరిగింది?

సూరజ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్‌లో ఒక విద్యార్థి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. టెన్త్ క్లాస్ చదువుతున్న ఆ విద్యార్థిని గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో అత్యంత దారుణంగా హతమార్చారు. ఆ విద్యార్థి రాత్రంతా ఇంట్లోనే ఉండి, చదువుకుంటూ....తెల్లారేసరికి కుటుంబ సభ్యులకు ఇంటికి కిలోమీటరు దూరంలో గల పొదల్లో రక్తంతో తడిసిన మృతదేహంలా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. 

ఈ ఘటన జయ్‌నగర్ పరిధిలోని బ్రజ్‌నగర్‌ గ్రామంలో  చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం బ్రజ్‌నగర్ నివాసి రాజేంద్ర ప్రసాద్ రాజ్వాడే కుమారుడు రితిక్ రాజ్వాడే(15) టెన్త్ విద్యార్థి. ఇక్కడి యూవీ సంస్కార్ స్కూలులో చదువుకుంటున్నాడు. రాత్రి 11 గంటల వరకూ రితిక్ చదువుకుంటూ ఉండటంతో మిగిలిన కుటుంబ సభ్యులు నిద్రపోయేందుకు వారి గదుల్లోకి వెళ్లిపోయారు. ఇదేసమయంలో రితిక్ ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. ఉదయం 3 గంటల సమయంలో కుటుంబ సభ్యులు లేచి చూసేసరికి రితిక్ గది తలుపు తెరిచివుంది. దీంతోవారు గదిలోకి వెళ్లి చూశారు. అక్కడ రితిక్ కనిపించలేదు. వెంటనేవారు రితిక్ కోసం వెదుకులాట ప్రారంభించారు. ఇంటికి ఒక కిలోమీటరు దూరంలో పొదల మాటున రక్తంతో తడిసిన అచేతన స్థితిలో రితిక్ వారికి కనిపించాడు. 

రితిక్‌పై ఎవరో మారణాయుధాలతో దాడి చేసినట్లు అతని శరీరంపై గుర్తులున్నాయి. రితిక్ కుటుంబ సభ్యుల నుంచి అందిన ఫిర్యాదుతో పోలీసుల బృందం... డాగ్ స్క్వాడ్‌తో సహా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. పోలీసు అధికారి సునీల్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రితిక్ కుటుంబ సభ్యులు ఈ హత్య విషయంలో ఎవరిపైనా ఇంతవరకూ అనుమానం వ్యక్తం చేయలేదన్నారు. హంతకులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ప్రారంభించామన్నారు.


ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...