పోర్న్‌ చూడలేదని ఆరేళ్ల బాలిక హత్య

ABN , First Publish Date - 2021-10-23T08:15:21+05:30 IST

ఆ ముగ్గురు బాలుర వయసు 8, 11, 11 ఏళ్లే. ఆ వయసులోనే అశ్లీల వీడియోలకు బానిసలైన వీళ్లు ఏకంగా ఓ ఆరేళ్ల బాలికను హత్య చేశారు...

పోర్న్‌ చూడలేదని ఆరేళ్ల బాలిక హత్య

నిందితుల్లో ముగ్గురు 8-11 ఏళ్ల బాలురు

గువాహటి, అక్టోబరు 22: ఆ ముగ్గురు బాలుర వయసు 8, 11, 11 ఏళ్లే. ఆ వయసులోనే అశ్లీల వీడియోలకు బానిసలైన వీళ్లు ఏకంగా ఓ ఆరేళ్ల బాలికను హత్య చేశారు. సామూహిక అత్యాచారానికి కూడా పాల్పడ్డారనే సందేహాలున్నా పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. ఈ ఘటన అసోంలోని నాగోన్‌ జిల్లాలో జరిగింది. దారుణ విషయం ఏం టంటే.. వీరికి ఆ వీడియోలు చూపించేది ఆ ముగ్గురిలో ఒకరి తండ్రి. వీళ్ల ఇళ్లకు దగ్గర్లో ఉండే ఆరేళ్ల బాలికను ఓ క్వారీ దగ్గరకు తీసుకెళ్లిన ఈ నలుగురూ.. తమతో కలిసి పోర్న్‌ వీడియోలు చూడాలని బలవంతపెట్టారు. అందుకు ఆ బాలిక నిరాకరించడంతో రాళ్లతో కొట్టి చంపేశారు. 

Updated Date - 2021-10-23T08:15:21+05:30 IST