Abn logo
Sep 22 2021 @ 15:17PM

మద్యం మత్తులో మహిళ హత్య

నల్గొండ: ముషంపల్లి గ్రామంలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది.మద్యం మత్తులో ధనలక్ష్మి (54)అనే మహిళను దుండగులు హత్య చేశారు. స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ స్ధానికులని అడిగి విషయం తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మహిళ ఒంటిపై బంగారు ఆభరణాలు మాయమవడంతో, ఆభరణాల కోసమే హత్యకు పాల్పడ్డట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యతో మృతిరాలి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption