మా రాష్ట్రం అబ్బాయే కదా అని చేరదీయడమే భర్త చేసిన తప్పు.. ఇంట్లో భార్య ఒంటిరిగా ఉన్నప్పుడు ఆ కుర్రాడు చేసిన పనికి అతడు షాక్!

ABN , First Publish Date - 2021-11-14T01:52:42+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించడంతో అన్ని దేశాలు లాక్‌డౌన్ బాటపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కూడా దేశంలో లాక్‌డౌన్ విధించింది. దీంతో చాలా మంది ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉపాధి కో

మా రాష్ట్రం అబ్బాయే కదా అని చేరదీయడమే భర్త చేసిన తప్పు.. ఇంట్లో భార్య ఒంటిరిగా ఉన్నప్పుడు ఆ కుర్రాడు చేసిన పనికి అతడు షాక్!

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించడంతో అన్ని దేశాలు లాక్‌డౌన్ బాటపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కూడా దేశంలో లాక్‌డౌన్ విధించింది. దీంతో చాలా మంది ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉపాధి కోల్పోయి.. తినడానికి తిండి కూడా లేకుండా ఇబ్బంది పడుతున్న ఓ యువకుడిని.. ఆ దంపతులు చేరదీశారు. మా రాష్ట్రం కుర్రాడే కదా.. అని డబ్బులు కూడా తీసుకోకుండా కడుపు నిండా అన్నం పెట్టారు. అయితే తాజాగా అతడు నీచానికి పాల్పడ్డాడు. భర్త లేని సమయం చూసి.. భార్యతో దారుణంగా ప్రవర్తించాడు. విషయం తెలిసి ఆ భర్త ఒక్కసారిగా షాకయ్యాడు. కాగా.. ఇంతకూ ఏం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే.. 


బిహార్‌కు చెందిన నవనీత్ అనే వ్యక్తికి రీచా అనే మహిళతో కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. ఈ క్రమంలో ఆ దంపతులు ఉపాధి కోసం హర్యానాకు వెళ్లారు. నవనీత్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ.. బహదూర్‌ఘర్ ప్రాంతంలో ఓ అద్దె గదిలో భార్యతో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే కరోనా కారణంగా హర్యానాలో లాక్‌డౌన్ అమలైంది. సరిగ్గా అదే సమయంలో ఆ దంపతులకు పక్క గదిలోనే ఉంటున్న బిహార్ కుర్రాడు నిరంజన్‌తో పరిచయం ఏర్పడింది. లాక్‌డౌన్ కారణంగా అతడు తిండికి ఇబ్బంది పడుతున్న గుర్తించిన భార్యభర్తలు.. నిరంజన్‌ను చేరదీశారు. కడుపు నిండా అన్నం పెట్టారు. ఈ నేపథ్యంలోనే కరోనా ప్రభావం తగ్గడంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలు సడలించింది. అప్పటి నుంచి ఆ దంపతులు నిరంజన్‌కు భోజనం పెట్టడం మానేశారు. 



వండుకుని తినాలని సూచించారు. అయితే నవనీత్ అతడి భార్య రీచా చేసిన సూచన నిరంజన్‌కు నచ్చలేదు. లాక్‌డౌన్‌లో మాదిరిగానే ఎప్పటికీ తనకు వండిపెట్టాలని పట్టుబట్టాడు. దానికి ఆ దంపతులు ఒప్పుకోలేదు. తాజాగా ఇదే విషయంపై నవనీత్ ఇంట్లో లేని సమయంలో రీచాతో నిరంజన్ గొడవకు దిగాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో.. తీవ్ర ఆగ్రహానికి లోనైన నిరంజన్.. రీచాను రాయితో కొట్టి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ బిల్డింగ్ మీద నుంచి జారి పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. కాగా.. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని రీచా మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిరంజన్‌కు తొలుత ఆసుపత్రిలో చికిత్స చేయించి పోలీసులు.. తర్వాత అతడిని జైలుకు తరలించారు. 




Updated Date - 2021-11-14T01:52:42+05:30 IST