Abn logo
Sep 27 2021 @ 01:06AM

నలుగురి దుర్మరణం

మృతిచెందిన ఆనంద్‌

వేర్వేరు చోట్ల  రోడ్డు ప్రమాదాలు.. 

మృతుల్లో ఇద్దరు చిన్నారులు.. 

 జిల్లాలో ఆదివారం వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వాహనాల అతి వేగమే ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా బైక్‌ ఢీకొనడంతో నాలుగేళ్ల బాలుడు మృతిచెందాడు. నోటుబుక్‌ తెచ్చుకోవడానికి టీవీఎస్‌ వాహనంపై వెళ్లిన ఆరో తరగతి విద్యార్థి లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయాడు. రాయదుర్గం మండలంలోని ఆవులదట్ల గ్రామ సమీపంలో బైక్‌ను కారు ఢీకొనడంతో వలంటీర్‌, ట్రాక్టర్‌ని లారీ వెనుకనుంచి ఢీకొట్టడంతో ట్రాలీ బోల్తాపడి ఒకరు మృతి చెందారు. 


బైక్‌ ఢీకొని బాలుడు...

తాడిపత్రిటౌన, సెప్టెంబరు26: పెద్దపప్పూరు మండలంలోని చాగల్లు గ్రామం వద్ద ఆదివారం బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో చిన్నారి ఆనంద్‌ (4) మృతి చెందాడు. ఎస్‌ఐ గౌస్‌మహమ్మద్‌ తెలిపిన మేరకు చాగల్లు గ్రామానికి చెందిన రామాంజనేయులు, గాయత్రీ దంపతుల కుమారుడు ఆనంద్‌ను అత్త నారాయణమ్మ గ్రామ సమీపంలో ఉన్న తోటలోకి తీసుకెళ్లింది. అక్కడి నుంచి సీతాఫలం పండ్లను తీసుకొని వస్తుండగా పప్పూరువైపు నుంచి తబ్జుల వైపు వెళుతున్న గుర్తుతెలియని ద్విచక్రవాహనం వేగంగా వచ్చి చిన్నారిని ఢీకొంది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. చిన్నారి తల్లిదండ్రు లకు ముగ్గురు కుమారులు కాగా ఆనంద్‌ రెండో సంతానం.  


మృతి చెందిన మణికంఠ

 విద్యార్థి..

కుందుర్పి, సెప్టెంబరు26:  మండలంలోని బండమీదపల్లి గ్రామానికి చెం దిన రాధాకృష్ణకు మారుడు మణికంఠ (11) ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం లో మృతి చెందాడు. కుందుర్పి ఉన్నత పా ఠశాలలో 6వ తరగతి చదువుతున్న మణికంఠ ఆదివారం సెలవు కావడంతో  నోట్‌బుక్‌ తీసుకురావడానికి టీవీఎస్‌ ఎక్సెల్‌పై బయల్దేరాడు. బండమీదపల్లి గ్రామా న్ని దాటి వస్తుండగా కుందుర్పి నుంచి వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మణికంఠ అక్కడికక్కడే మరణించాడు. అటుగా వెళ్తున్న స్థానికులు మృ తుడి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని చేరవేశా రు. ఒక్కగానొక్క కొడుకు నోటు పుస్తకానికని వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చే రుకు ని, కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 


ప్రమాదంలో చనిపోయిన చంద్రానాయక్‌

ట్రాక్టర్‌ని ఢీకొట్టిన లారీ: ఒకరు బలి

చిలమత్తూరు, సెప్టెంబరు 26: ముందు వెళుతున్న ట్రాక్టర్‌ని లారీ ఢీకొట్టడంతో ట్రాక్టర్‌ బోల్తా పడి  దిగువ పల్లి తండాకి చెందిన రామచంద్రానాయక్‌(45) ఆదివారం మృతి చెందాడు. రామచంద్రానాయక్‌ పొట్టేళ్ల పోషణకై దాణా కొనుగోలు చేయడానికి బాగేపల్లికి వెళ్లాడు. ఇంటికి వచ్చే క్రమంలో మట్టిలోడుతో వస్తున్న ట్రాక్టర్‌లో కొనుగోలు చేసిన రెండు బస్తాల దాణాను వేసి అతడు కూడా అదే ట్రాక్టర్‌లో కూర్చున్నాడు. ఈ క్రమంలో 44వ జాతీయ రహదారిలోని లాలేపల్లి క్రాస్‌ వద్దకు రాగానే వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ ట్రాక్టర్‌ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో ట్రాలీ బోల్తా పడి అందులో ఉన్న చంద్రానాయక్‌ రోడ్డుపై ఎగిరిపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతడికి భార్య శాంతిబాయి, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదంపై విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీని కొడికొండ చెక్‌పోస్టులో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మృతి చెందిన గోవిందనాయక్‌

బైక్‌, కారు ఢీ..వలంటీర్‌ దుర్మరణం

రాయదుర్గంరూరల్‌, సెప్టెంబరు 26 : మండలంలోని ఆవులదట్ల గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రో డ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన వలంటీర్‌ గోవిందనాయక్‌ (28) మృతి చెందా డు. శివానాయక్‌ అనే వ్యక్తి తీ వ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన  మేరకు గోవిందనాయక్‌, శివానాయక్‌లు ఇద్దరు ద్విచక్రవాహనంపై రాయదుర్గం నుంచి ఆవులదట్ల వైపు వెళ్తుండగా రాయదుర్గం నుంచి వెళ్తున్న కర్ణాటకకు చెందిన కారు వెనుక వైపు నుంచి ఢీకొంది. దీంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వారిని రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రి తరలించగా చికిత్స పొందుతూ వలంటీర్‌ గోవిందనాయక్‌ మృతి చెందినట్లు తెలిపారు. ఇతడికి భార్య ఆదిలక్ష్మీబాయి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.