HYD : హత్యాయత్నం కేసులో Arrest చేయడానికి పోలీసులు వెళ్తే.. ఏం చేశాడో చూడండి..!

ABN , First Publish Date - 2021-10-08T17:28:12+05:30 IST

స్థల వివాదంలో ఒకరిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేయడానికి వెళ్లిన

HYD : హత్యాయత్నం కేసులో Arrest చేయడానికి పోలీసులు వెళ్తే.. ఏం చేశాడో చూడండి..!

  • పోలీసులపై కుక్కలను వదిలారు

హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : స్థల వివాదంలో ఒకరిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులపై జాగిలాలను వదిలి తప్పించుకునేందుకు ప్రయత్నించాడో వ్యక్తి. చివరకు పోలీసులకు పట్టుబడి ఊచలు లెక్కిస్తున్నాడు. బంజారాహిల్స్‌లో నివాసం ఉండే జాఫ్రీకి, జూబ్లీహిల్స్‌లో ఉండే మహ్మద్‌ ఆరీఫ్‌ల మధ్య కొద్ది కాలంగా స్థల వివాదం నడుస్తోంది. స్థలం దక్కించుకునేందుకు ఆరీఫ్‌ 20 మందితో కలిసి జాఫ్రీ ఇంటిపై దాడి చేశాడు. హత్య చేసేందుకు ప్రయత్నించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆరీఫ్‌, అతని మనుషులపై బంజారాహిల్స్‌ పోలీసులుహత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేయడానికి బంజారాహిల్స్‌ పోలీసులు ఆరీఫ్‌ ఇంటికి గురువారం వెళ్లారు. గేటు నుంచి పోలీసులు ఇంట్లోకి రాకుండా అడ్డుకునేందుకు అతను, కుటుంబ సభ్యులు జాగిలాలు వదిలారు. హై డ్రామా సృష్టించారు. పోలీసులు అదనపు సిబ్బందిని రంగంలోకి దించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. విధులకు అడ్డంకులు సృష్టించినందుకు ఆయనపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-10-08T17:28:12+05:30 IST