ముర్గ్‌ మలాయి కబాబ్‌

ABN , First Publish Date - 2021-05-15T17:15:18+05:30 IST

బోన్‌లెస్‌ చికెన్‌ - ఒకకేజీ, ఉప్పు - తగినంత, పచ్చిమిర్చి - 100గ్రా, నిమ్మకాయలు - నాలుగు, అల్లంవెల్లుల్లి పేస్టు - 50గ్రా, పెరుగు - 100గ్రా, జీడిపప్పు - 100గ్రా, జీలకర్ర పొడి - 50గ్రా, మెంతిపొడి

ముర్గ్‌ మలాయి కబాబ్‌

కావలసినవి: బోన్‌లెస్‌ చికెన్‌ - ఒకకేజీ, ఉప్పు - తగినంత, పచ్చిమిర్చి - 100గ్రా, నిమ్మకాయలు - నాలుగు, అల్లంవెల్లుల్లి పేస్టు - 50గ్రా, పెరుగు - 100గ్రా, జీడిపప్పు - 100గ్రా, జీలకర్ర పొడి - 50గ్రా, మెంతిపొడి - 50గ్రా, గరంమసాల - 50గ్రా, తెల్లమిరియాల పొడి - 50గ్రా, కుకింగ్‌ క్రీమ్‌ - 100ఎంఎల్‌.


తయారీ విధానం: చికెన్‌ను శుభ్రం చేసి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తరువాత నిమ్మరసం, అల్లంవెల్లుల్లి పేస్టు కలిపి, తగినంత ఉప్పు వేసి మారినేట్‌ చేసుకోవాలి. ఒక పాత్రలో పెరుగు తీసుకుని అందులో జీడిపప్పు పేస్టు, జీలకర్రపొడి, మెంతిపొడి, మిరియాలపొడి, గరంమసాల, కుకింగ్‌ క్రీమ్‌ వేసి కలుపుకొని మసాలా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మారినేట్‌ చేసిన చికెన్‌ ముక్కలను మసాలాలో వేసి ముక్కలకు మసాలా పట్టేలా కలపాలి. తరువాత చికెన్‌ ముక్కలను పుల్లకు గుచ్చాలి. తందూరీ పాట్‌లో ఉడికించాలి. పుదీనా చట్నీతో సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2021-05-15T17:15:18+05:30 IST