పాత కార్ల మ్యూజియం!

ABN , First Publish Date - 2021-04-14T05:30:00+05:30 IST

అక్కడ పాత కార్లన్నీ కుప్పలు కుప్పలుగా పడి ఉంటాయి. కార్లన్నీ తుప్పు పట్టిపోయి కనిపిస్తుంటాయి. అమెరికాలో అట్లాంటాకు 50 మైళ్ల దూరంలోని ఓల్డ్‌ కార్స్‌ సిటీ అని పిలిచే ప్రదేశంలో కనిపిస్తుందీ దృశ్యం

పాత కార్ల మ్యూజియం!

అక్కడ పాత కార్లన్నీ కుప్పలు కుప్పలుగా పడి ఉంటాయి. కార్లన్నీ తుప్పు పట్టిపోయి కనిపిస్తుంటాయి. అమెరికాలో అట్లాంటాకు 50 మైళ్ల దూరంలోని ఓల్డ్‌ కార్స్‌ సిటీ అని పిలిచే ప్రదేశంలో  కనిపిస్తుందీ దృశ్యం.

  • ‘ద వరల్డ్‌ ఓల్డెస్ట్‌ జంక్‌యార్డ్‌ జంగిల్‌’గా పేరొందిన ఈ ప్రదేశానికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. 1931లో లూయిస్‌ కుటుంబం ఒక చిన్న జనరల్‌ స్టోర్స్‌ను ప్రారంభించింది. దాంతో పాటు కార్ల విడి భాగాలు, టైర్లు కూడా అమ్మేవారు. అమెరికా రెండో ప్రపంచయుద్ధంలోకి ప్రవేశించిన తరువాత స్టీల్‌ ధర బాగా పెరిగింది. దాంతో లూయీ కుటుంబం తుక్కు వ్యాపారంలోకి ప్రవేశించింది.
  • పాత కార్లు కొనడం వాటిని తిరిగి తుక్కు కింద అమ్మేయడం చేసే వారు. లూయీ వారసులు సైతం అదే వ్యాపారాన్ని కొనసాగించారు. 1970లో డీన్‌ లూయిస్‌ చేతికి వచ్చిన తరువాత కీలక నిర్ణయం తీసుకున్నారు. 
  • పాత కార్లను కొనడం చేసేవారు. కానీ వాటిని తిరిగి తుక్కుగా అమ్మేయడం మానేశారు. వాటిని అలాగే తన ప్రదేశంలో పెట్టడం ప్రారంభించారు. ఇప్పుడు కొన్ని ఎకరాల విస్తీర్ణంలో వేల పాత కార్లు ఉన్నాయి. 
  • ఆ ప్రదేశాన్ని ఓల్డ్‌ కార్స్‌ మ్యూజియంగా పిలుస్తుంటారు. ఇక్కడి సందర్శనకు వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువే.

Updated Date - 2021-04-14T05:30:00+05:30 IST