మష్రూమ్‌ సూప్‌

ABN , First Publish Date - 2020-02-10T20:16:09+05:30 IST

బటన్‌ మష్రూమ్స్‌- కప్పు, ఆలివ్‌ ఆయిల్‌- టేబుల్‌ స్పూన్‌, బట్టర్‌ - టేబుల్‌స్పూన్‌, తరిగిన అల్లం- టేబుల్‌ స్పూన్‌, సన్నగా తరిగిన ఉల్లిపాయ, మైదాపిండి- ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, పాలు (నల్లమిరయాల పొడి కలిపినవి)- ఒకటిన్నర కప్పు, ముప్పావుకప్పు- ఫ్రెష్‌క్రీమ్‌

మష్రూమ్‌ సూప్‌

కావాల్సినవి: బటన్‌ మష్రూమ్స్‌- కప్పు, ఆలివ్‌ ఆయిల్‌- టేబుల్‌ స్పూన్‌, బట్టర్‌ - టేబుల్‌స్పూన్‌, తరిగిన అల్లం- టేబుల్‌ స్పూన్‌, సన్నగా తరిగిన ఉల్లిపాయ, మైదాపిండి- ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, పాలు (నల్లమిరయాల పొడి కలిపినవి)- ఒకటిన్నర కప్పు, ముప్పావుకప్పు- ఫ్రెష్‌క్రీమ్‌. ఉప్పు తగినంత, వాము ఆకులు గార్నిష్‌ కోసం.


తయారీ: నాన్‌స్టిక్‌ పాన్‌లో ఆలివ్‌ ఆయిల్‌, బట్టర్‌ను వేడిచేయాలి. తరిగిన అల్లం వేసి కలపాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేదాకా వేగించాలి.వాము ఆకులు, మైదా పిండి వేసి బాగా కలిపి నిమిషం పాటు వేగించాలి. బటన్‌ మష్రూమ్స్‌, ఉప్పు వేసి మిక్స్‌ చేసి 5 నుంచి 6 నిమిషాలు ఉడికించాలి. మరిన్ని మష్రూమ్స్‌ వేసి, తగినన్ని నీళ్లు పోసి, ఉప్పు వేసి కొద్దిసేపు మంటపై ఉంచాలి. తరువాత మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేడిచేసి, పాలు పోసి 2నిమిషాలు మంటపై ఉంచాలి. ఇప్పుడు ఫ్రెష్‌క్రీమ్‌, మిరియాల పొడి చల్లాలి. వాము  ఆకులతో గార్నిష్‌ చేస్తే వేడివేడి మష్రూమ్‌ సూప్‌ రెడీ.

Updated Date - 2020-02-10T20:16:09+05:30 IST