Abn logo
Aug 30 2021 @ 08:36AM

మూసీ ప్రాజెక్ట్‌కు పెరుగుతున్న వరద ప్రవాహం

నల్లగొండ: భారీ వర్షాల కారణంగా మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ మూడు గేట్ల నుంచి  నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో  5,868.71 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 3,535.27 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 4.15 టీఎంసీలుగా నమోదు అయ్యింది.