అరచేతిలో మ్యూజిక్‌ హోరు!

ABN , First Publish Date - 2020-06-27T05:30:00+05:30 IST

పాత తెలుగు సినిమా పాటలు, బాలీవుడ్‌ క్లాసిక్స్‌, అందరూ మెచ్చే గజల్స్‌... పాట ఏదైనా, ఏ భాషలోనైనా మీకిష్టమైన పాట వినాలంటే స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్స్‌ ఉంటే చాలు. కోట్ల పాటల లైబ్రరీలతో సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్న మ్యూజిక్‌ యాప్స్‌ విశేషాలివి...

అరచేతిలో మ్యూజిక్‌ హోరు!

పాత తెలుగు సినిమా పాటలు, బాలీవుడ్‌ క్లాసిక్స్‌, అందరూ మెచ్చే గజల్స్‌... పాట ఏదైనా, ఏ భాషలోనైనా మీకిష్టమైన పాట వినాలంటే స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్స్‌ ఉంటే చాలు. కోట్ల పాటల లైబ్రరీలతో సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్న మ్యూజిక్‌ యాప్స్‌ విశేషాలివి ...


అమెజాన్‌ మ్యూజిక్‌

ఈ రోజుల్లో దాదాపు అందరికీ అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యత్వం ఉంటోంది. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ఉన్న వాళ్లు అమెజాన్‌ మ్యూజిక్‌ సర్వీసును పొందే వీలుంది. ఇందులో మ్యూజిక్‌ ప్రియుల కోసం  ఆన్‌లైన్‌లో  6 కోట్లకు పైగా పాటలు ఉన్నాయి. వంట చేసేటప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు, సాయంకాలం వేళల్లో బాల్కనీలో కూర్చున్నప్పుడు మీకిష్టమైన పాటను ప్లే చేసుకుని వినొచ్చు. మీరు కోరుకున్న పాటను అలెక్సా వినిపిస్తుంది. ‘అమెజాన్‌ మ్యూజిక్‌’ సంగీతప్రియుల కోసం రకరకాల ప్లాన్స్‌లో, అన్‌లిమిటెడ్‌ ఆఫర్స్‌ను అందిస్తోంది. యాడ్స్‌ గోల లేకుండా పాటలు వినొచ్చు. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ఉంటే ఇంట్లో ఉన్న ఏ డివైజ్‌లోనైనా పాటలు వినే వీలుంది. 


వింక్‌

మీరు ఎయిర్‌టెల్‌ సిమ్‌ వాడుతున్నారా? అయితే ఈ యాప్‌ ఫ్రీ వెర్షన్‌ను పొందడం ద్వారా అన్‌లిమిటెడ్‌గా సాంగ్స్‌ వినవచ్చు. ఇకపోతే ఇందులో ఉన్న మరో అదనపు ప్రత్యేకత ఏమిటంటే మీ ఫోన్‌లో అప్పటికే ఉన్న ఎంపీ 3 పాటలను ఈ యాప్‌ సహాయంతో వినవచ్చు. ఇండియన్‌ మ్యూజిక్‌ను ఇష్టపడే వారికి వింక్‌ లైబ్రరీ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్‌ పాటలు అందుబాటులో ఉంటాయి. ఈ యాప్‌లోని పాత బాలీవుడ్‌ పాటలు స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తాయి.


స్పాటిఫై 

ప్రతిరోజూ 20 వేల కొత్త పాటలను జోడిస్తూ సంగీత ప్రియుల మనసు దోచుకుంటోంది స్పాటిఫై. సుమారు 12 కోట్ల మంది వినియోగదారులతో ఈ యాప్‌ దూసుకెళుతోంది. మీ అభిరుచికి అనుగుణంగా ప్లేలిస్ట్‌ క్రియేట్‌ చేసుకోవచ్చు. ప్రీమియం సబ్‌స్ర్కిప్షన్‌ తీసుకుంటే ప్రకటనల సమస్య ఉండదు. తెలుగు, హిందీ, తమిళంతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో పాటలు అందుబాటులో ఉంటాయి.


హంగామా మ్యూజిక్‌

భాంగ్రా నుంచి భజనల వరకు, క్లాసిక్స్‌ నుంచి కాంటెంపరరీ వరకు అన్ని రకాల పాటలు హంగామా మ్యూజిక్‌లో అందుబాటులో ఉంటాయి. హిందీ పాటలతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ పాటలు వినొచ్చు. అన్‌లిమిటెడ్‌ మ్యూజిక్‌ యాక్సెస్‌ ఉంది. ఎంపీ3 పాటలను డివైజ్‌లో, ప్రాంతీయ భాషల్లోని టాప్‌ ప్లే లిస్ట్‌లను ఎంపిక చేసుకుని వినవచ్చు.


గానా

ఈ యాప్‌కి ఇండియాలో 15 కోట్ల మంది యాక్టివ్‌ వినియోగదారులు ఉన్నారు. ఇక పాటల సంఖ్య నాలుగున్నర కోట్లకు పైనే. ఇందులో మరో ప్రత్యేకత ఏమంటే ఏ భాష పాట కావాలన్నా ఎంచుకోవచ్చు. 16 భాషల్లో పాటలు, వేల ప్లేలిస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. ట్రెండింగ్‌ సాంగ్స్‌  వినొచ్చు. పాత పాటలు కావాలంటే ఓల్డ్‌ వన్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి. న్యూ రిలీజ్‌, పాపులర్‌ ఇన్‌ హిందీ, టాప్‌ పిక్స్‌, ఆల్బమ్స్‌ను సెలక్ట్‌ చేసుకోవచ్చు. ఆర్టిస్టుల పాటలు ఎంపిక చేసుకునే సదుపాయం కూడా ఉంది. 30కి పైగా రేడియో మిర్చి స్టేషన్లు ట్యూన్‌ చేసుకోవచ్చు. 


జియోసావన్‌

ఆడియో షో ద్వారా పాపులర్‌ అయిన యాప్‌ ఇది. ‘నో ఫిల్టర్‌ నేహా’ పేరుతో ప్రసారమయ్యే ఆడియో షో శ్రోతలను ఆకట్టుకుంటోంది. జియోసావన్‌లో నాలుగున్నర కోట్లకు పైగా పాటలు అందుబాటులో ఉన్నాయి. ఒక అకౌంట్‌తో లాగిన్‌ అయితే ఐదు డివైజ్‌లలో పాటలు వినవచ్చు. పాటలను అన్‌లిమిటెడ్‌గా డౌన్‌లోడ్‌ చేసుకొని ఆఫ్‌లైన్‌లో వినే సౌకర్యం ఉంది.


గూగుల్‌ ప్లే మ్యూజిక్‌

ఇందులో ప్లే లి్‌స్టలు క్రియేట్‌ చేసుకోవచ్చు. వాటిని స్నేహితులతో షేర్‌ చేసుకోవచ్చు. ఒక్కో ప్లే లి్‌స్టలో వేయి పాటలు జత చేయొచ్చు. వ్యక్తిగత కలెక్షన్లను గూగుల్‌ సర్వర్‌లోకి అప్‌లోడ్‌ చేసే వీలుంది. స్ట్రీమింగ్‌ క్వాలిటీ బాగుంటుంది. నాణ్యమైన సంగీతం వినొచ్చు. యాప్‌ డిజైన్‌ మ్యూజిక్‌ ప్రియులను ఆకట్టుకుంటుంది. యాప్‌లోనే కాకుండా వెబ్‌ప్లేయర్‌లోనూ వినవచ్చు.


Updated Date - 2020-06-27T05:30:00+05:30 IST