Abn logo
Jan 20 2021 @ 12:49PM

‘లూసిఫర్‌’ రీమేక్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరో తెలుసా?

సూప‌ర్‌స్టార్ మోహ‌న్ లాల్ న‌టించిన మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ 'లూసీఫర్' తెలుగు రీమేక్ లో న‌టించేందుకు మెగాస్టార్ చిరంజీవి స‌ర్వ‌స‌న్నాహ‌ల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. 'ఆచార్య' చిత్రీక‌ర‌ణ సాగుతుండ‌గానే 153 వ సినిమాగా రానున్న ఈ మూవీని ప్రకటించడమే కాకుండా ద‌ర్శ‌కుడిని కూడా ఫైన‌ల్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాకు సంబంధించి ఎంతో మంది దర్శకుల పేర్లు వినిపించినప్పటికీ చివరికీ.. ఆ అవకాశం 'తనిఒరువన్‌' దర్శకుడు మోహన్‌రాజాకు దక్కింది. మోహన్‌రాజా రెడీ చేసిన రీమేక్‌ వెర్షన్‌ నచ్చడంతో.. వెంటనే చిరు డైరెక్టర్‌ను అనౌన్స్‌ చేశారు. జనవరి ఎండింగ్‌ నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లో ఏకథాటిగా షూటింగ్‌ జరిపేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లుగా ఇటీవల అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమాకి మ్యూజిక్‌ డైరెక్టర్‌ కూడా కన్ఫర్మ్‌ అయ్యారు.


మెగాస్టార్‌ చిరంజీవి సినిమాకి మ్యూజిక్‌ అందించాలని ఎప్పటి నుంచో వేచి చూస్తున్న మ్యూజిక్‌ మిస్సైల్‌ ఎస్‌.ఎస్‌. థమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్లుగా స్వయంగా థమనే తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ''ప్రతి మ్యూజిక్‌ డైరెక్టర్‌కు ఇదొక పెద్ద కల. ఇప్పుడు నా వంతు వచ్చింది. బిగ్‌బాస్‌ శ్రీ మెగాస్టార్‌ చిరంజీవిగారి మీద నాకున్న ప్రేమను ప్రదర్శించే అవకాశం లభించింది. చిరంజీవిగారితో, మై బ్రదర్‌ మోహన్‌రాజాతో నా మ్యూజికల్‌ జర్నీ లూసిఫర్‌ (తెలుగు)తో మొదలవుతోంది.. '' అని థమన్‌ తన ఆనందాన్ని ఈ ట్వీట్‌లో తెలియజేశారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అండ్ ఎన్.వి. ప్ర‌సాద్ (ఎన్.వి.ఆర్ సినిమా) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.


Advertisement
Advertisement
Advertisement