సంగీత విద్వాంసుడు ముస్తాఫా ఖాన్‌ ఇకలేరు

ABN , First Publish Date - 2021-01-18T07:31:25+05:30 IST

ప్రముఖ హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత ఉస్తాద్‌ గులామ్‌ ముస్తాఫా ఖాన్‌ (89)

సంగీత విద్వాంసుడు ముస్తాఫా ఖాన్‌ ఇకలేరు

ముంబై, జనవరి 17: ప్రముఖ హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత ఉస్తాద్‌ గులామ్‌ ముస్తాఫా ఖాన్‌ (89) ఆదివారం కన్నుమూశారు. బాంద్రాలోని నివాసంలో తుదిశ్వాస విడిచారని ఆయన కోడలు నమ్రత గుప్తా ఖాన్‌ తెలిపారు. 2019లో బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో అప్పటి నుంచి ఖాన్‌ మంచానికే పరిమితమయ్యారు. ఉత్తరప్రదేశ్‌ బదౌన్‌లో మార్చి 3, 1931లో జన్మించిన ఖాన్‌ తండ్రి దగ్గర శాస్త్రీయ గాత్ర సంగీతంలో శిక్షణపొందిన తర్వాత, మేనమామ ఉస్తాద్‌ నిస్సార్‌ హుస్సేన్‌ ఖాన్‌ దగ్గర శిక్షణను పూర్తిచేశారు. ఖాన్‌ మృతికి ప్రధాని నరేంద్రమోదీ, లతామంగేష్కర్‌, రెహ్మాన్‌ తదితరులు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 

Updated Date - 2021-01-18T07:31:25+05:30 IST