మస్క్‌ నెం.1

ABN , First Publish Date - 2021-01-08T06:39:23+05:30 IST

అమెరికన్‌ విద్యుత్‌ కార్ల కంపెనీ టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌.. ప్రపంచ కుబేరుల జాబితాలో తొలిసారిగా అగ్రస్థానానికి చేరుకున్నారు. గురువారం టెస్లా షేరు మరింత

మస్క్‌  నెం.1

 ప్రపంచ ధనికుల్లో అగ్రస్థానానికి టెస్లా చీఫ్‌ 

 రెండో స్థానానికి జారుకున్న అమెజాన్‌ అధిపతి  


న్యూయార్క్‌: అమెరికన్‌ విద్యుత్‌ కార్ల కంపెనీ టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌.. ప్రపంచ కుబేరుల జాబితాలో తొలిసారిగా అగ్రస్థానానికి చేరుకున్నారు. గురువారం టెస్లా షేరు మరింత ఎగబాకడంతో మస్క్‌ వ్యక్తిగత సంపద 18,500 కోట్ల డాలర్లు దాటేసింది. దీంతో అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజో్‌సను వెనక్కి నెట్టి రిచ్‌ లిస్ట్‌లో నెం.1 స్థానాన్ని సొంతం చేసుకున్నారు. బెజోస్‌ ప్రస్తుత సంపద 18,400 కోట్ల డాలర్ల స్థాయిలో ఉంది.


2017 నుంచి ప్రపంచ కుబేరుడుగా కొనసాగుతున్న బెజోస్‌.. అగ్రపీఠాన్ని కోల్పోవడం ఇదే తొలిసారి. 2020 మొదట్లో టాప్‌-50లో ఒకరిగా ఉన్న మస్క్‌ సంపద 2,700 కోట్ల డాలర్లు మాత్రమే. గడిచిన ఏడాది కాలంలో టెస్లా షేర్ల ధర 9 రెట్లకు పైగా పెరగడంతో ఆయన ఆస్తి ఏకంగా 15,000 కోట్ల డాలర్ల మేర పుంజుకుంది.


Updated Date - 2021-01-08T06:39:23+05:30 IST