Abn logo
Sep 26 2021 @ 00:31AM

మైనారిటీలకు రాజ్యాధికారాన్ని దూరం చేసేందుకు ఆళ్ల కుట్ర

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న దుగ్గిరాల టీడీపీ మండల అధ్యక్షుడు గూడూరు వెంకట్రావు తదితరులు

ముస్లిం నేతల ధ్వజం

మంగళగిరి, సెప్టెంబరు 25: మైనారిటీలకు రాజ్యాధికారాన్ని దూరం చేసేందుకు పోరాడుతున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీకి చెందిన పలువురు ముస్లిం మైనారిటీ నాయకులు హెచ్చరించారు. స్థానిక టీడీపీ కార్యాలయం డాక్టర్‌ ఎమ్మెస్సెస్‌ భవన్లో శనివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఓ ముస్లిం ఆడబిడ్డకు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ఎమ్మెల్యే ఆళ్ల రాజకీయ కక్ష కొద్దీ అడ్డుకోవడం శోచనీయమని అన్నారు. ముస్లింలను అణగదొక్కేందుకు జగన్‌ అండ్‌కో చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్రంలోని ముస్లింలందరూ గమనిస్తూనే వున్నారని.. వచ్చే ఎన్నికలలో వైసీపీకి తగినరీతిలో బుద్ధి చెబుతారన్నారు. ఈ సమావేశంలో గుంటూరు పార్లమెంటు టీడీపి అధికార ప్రతినిధి పఠాన్‌ కాశింఖాన్‌, నియోజకవర్గ టీడీపీ మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు ఎండీ ఇబ్రహీం, షేక్‌ రియాజ్‌, షేక్‌ సుభాని, పఠాన్‌ అబ్దుల్లాఖాన్‌, సయ్యద్‌ నిజాముద్దీన్‌, షేక్‌ కాలేషా, షేక్‌ హుస్సేన్‌, షేక్‌ నాగుల్‌మీరా, అబ్దుల్‌మజీద్‌, పఠాన్‌ జానీఖాన్‌, షేక్‌ కరీముల్లా, షేక్‌ నజీర్‌ అహ్మద్‌, షేక్‌ బాషా, షేక్‌ బుడే, సయ్యద్‌ ఖలీల్‌, సయ్యద్‌ ఖాదర్‌, షేక్‌ అబ్దుల్‌ రహీద్‌, షేక్‌ నజీర్‌, మొఘల్‌ మస్తాన్‌బేగ్‌, షేక్‌ దాదా, సయ్యద్‌ కరీముల్లా, ఎండీ అఫజలుద్దీన్‌, షేక్‌ ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు గూడూరు వెంకట్రావు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితులలోనూ దుగ్గిరాల మండల ఎంపీపీ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ చేజిక్కించుకుంటుందన్నారు.