‘ముస్లింల సేవలు అభినందనీయం’

ABN , First Publish Date - 2021-05-18T05:27:56+05:30 IST

కొవిడ్‌ కష్టకాలంలో ముస్లిం ట్రస్ట్‌ చేస్తున్న సేవలు అభినందనీయమని అఖిలపక్షం నాయకులు పేర్కొన్నారు.

‘ముస్లింల సేవలు అభినందనీయం’

హిందూపురం టౌన, మే 17: కొవిడ్‌ కష్టకాలంలో ముస్లిం ట్రస్ట్‌ చేస్తున్న సేవలు అభినందనీయమని అఖిలపక్షం నాయకులు పేర్కొన్నారు. కొంతమంది ముస్లిం యువకులు కలిసి కొవిడ్‌ బాదితులకు ఉచితంగా ఆక్సిజన సిలెండర్లను తీసుకెళ్లి అమర్చడం గొప్ప విషయమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్‌ సోకితే కుటుంబ సభ్యులే దూరంగా ఉంటున్న సమయంలో పట్టణం చుట్టూ ఆక్సిజన సిలిండర్‌ అవసరమైన వారికి ఉచితంగా తీసుకెళ్లి వారి ప్రాణాలను కాపాడటం ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా సిలిండర్లు అందజేస్తున్న ముస్లిం ట్రస్ట్‌ సభ్యులను సోమవారం అఖిలపక్షం నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇంతియాజ్‌, బాలాజీ మనోహర్‌, శ్రీరాములు, రమేష్‌, వెంకటేశులు, నవీన, ఉమర్‌ఫారూక్‌, ముస్లిం ట్రస్ట్‌ సభ్యులు చాంద్‌బాషా, సిద్దిక్‌, ఫైరోజ్‌, ఇమ్రాన, ఫయాజ్‌, నయాజ్‌, ఇర్షాద్‌, మాలిక్‌ తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-05-18T05:27:56+05:30 IST