‘సేవా భారతి’కి రూ. 5 లక్షల విరాళమిచ్చిన ముస్లిం మహిళ

ABN , First Publish Date - 2020-03-30T23:27:04+05:30 IST

లాక్‌డౌన్ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ‘సేవా భారతి’ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఓ ముస్లిం మహిళ

‘సేవా  భారతి’కి రూ. 5 లక్షల విరాళమిచ్చిన ముస్లిం మహిళ

జమ్ముకశ్మీర్: లాక్‌డౌన్ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ‘సేవా భారతి’ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఓ ముస్లిం మహిళ ముగ్ధురాలైంది. హజ్ యాత్ర కోసం తాను దాచుకున్న రూ. 5 లక్షలను ఆ సంస్థకు విరాళంగా ప్రకటించి తన గొప్ప మనసును చాటుకుంది. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఖలీదా బేగం (87) హజ్‌ యాత్రకు వెళ్లేందుకు రూ. 5 లక్షలు దాచుకుంది. ప్రస్తుత లాక్‌డౌన్ నేపథ్యంలో ఆమె తన ప్రణాళికను వాయిదా వేసుకుంది. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం సేవా భారతి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి ముగ్ధురాలైన బేగం జీ రూ. 5 లక్షలు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారని ఆరెస్సెస్ మీడియా వింగ్ ఇంద్రప్రస్థ విశ్వ సంవాద్ కేంద్ర (ఐవీఎస్‌కే) హెడ్ అరుణ్ ఆనంద్ తెలిపారు. 


కల్నల్ పీర్ మొహ్మద్ ఖాన్ కోడలు అయిన ఖలీదా బేగం జమ్మూకశ్మీర్‌లో విరాళం ప్రకటించిన కొద్దిమంది మహిళల్లో మొట్టమొదటి మహిళగా నిలిచారని ఆనంద్ తెలిపారు. మహ్మద్ ఖాన్ జన సంఘ్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారని ఆయన గుర్తు చేశారు. జన సంఘ్ ఆ తర్వాతి కాలంలో భారతీయ జనతా పార్టీగా మారింది. 


ఖలీదా బేగం కుమారుడు ఫరూఖ్ ఖాన్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు సలహాదారుగా ఉన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి దేశవ్యాప్తంగా ఉన్న సేవాభారతి వలంటీర్లు ఆహారం, ఇతర అసవరమైన వస్తువులను అందిస్తూ ఆదుకునే ప్ర్రయత్నం చేస్తున్నారు. 

Updated Date - 2020-03-30T23:27:04+05:30 IST