భారతీయ ముస్లింలకు ఈసారి హజ్‌యాత్ర లేనట్టే!

ABN , First Publish Date - 2020-06-07T01:34:56+05:30 IST

దేశంలో కరోనా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోగా రోజురోజుకు కేసులు మరింతగా పెరుగుతున్నాయి. ఈ

భారతీయ ముస్లింలకు ఈసారి హజ్‌యాత్ర లేనట్టే!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోగా రోజురోజుకు కేసులు మరింతగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి దేశంలోని ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. హజ్ యాత్రపై సౌదీ అరేబియా ప్రకటన చేసిన తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకోనుందని సమాచారం. హజ్ యాత్రకు ఇంకా కొన్ని రోజులే సమయం ఉన్నప్పటికీ సౌదీ అధికారుల నుంచి ఎటువంటి సమాచారం లేదని భారత హజ్ కమిటీ శుక్రవారం ఓ సర్క్యులర్‌లో తెలిపింది.


‘‘హజ్ యాత్ర 2020పై అనిశ్చితి, ఆందోళన దృష్ట్యా హజ్ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలనుకుని నిర్ణయించుకున్న యాత్రికులు, ఇప్పటి వరకు చెల్లించిన మొత్తాన్ని వంద శాతం తిరిగి చెల్లించాలని హజ్ కమిటీ నిర్ణయించింది’’ అని హజ్ కమిటీ ఆఫ్ ఇండియా సీఈవో మక్సూద్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు.


‘‘సౌదీ అరేబియాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. రెండు లక్షల మంది ఇక్కడి నుంచి వెళ్లాల్సి ఉంది. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది. ఇంకా కొంచెం సమయమే ఉండడంతో సౌదీ నుంచి అధికారిక ప్రకటన కోసం వేచి చూస్తున్నాం’’ అని ఉన్నత వర్గాలు తెలిపాయి. భారత్ నుంచి ఈసారి హజ్ యాత్రకు వెళ్లే వారు ఉండకపోవచ్చని ఆ వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2020-06-07T01:34:56+05:30 IST