అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన ఉండాలి

ABN , First Publish Date - 2021-04-19T06:04:28+05:30 IST

అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ అన్నారు.

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన ఉండాలి
అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది

సూర్యాపేట క్రైం, ఏప్రిల్‌ 18: అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ అన్నారు. అగ్ని ప్రమాదాల నివారణపై జిల్లాకేంద్రంలోని పలు వ్యాపార సముదాయాల్లో ఆది వారం అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాల సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ అ ప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రమాదం జరిగిన వెంటనే 101కు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫైర్‌ మెన్‌ యాదగిరి,నాగరాజు, వీరారెడ్డి, క్రిష్ణయ్య, రహీం తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-19T06:04:28+05:30 IST