Abn logo
Sep 22 2021 @ 23:37PM

చట్టాలపై అవగాహన ఉండాలి

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న జిల్లా జడ్జి రామకృష్ణ


శ్రీకాకుళం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): చట్టాలపై మహిళలకు అవగాహన ఉండాలని  జిల్లా న్యాయమూర్తి, న్యాయ సాధికార సంస్థ అధ్యక్షులు జి.రామకృష్ణ తెలిపారు. మహిళా రక్షణ చట్టాలపై రూపొందించిన పోస్టర్‌ను  ఆయన బుధవారం జిల్లా కోర్టులో ఆవిష్కరించారు.  కార్యక్రమంలో జిల్లా న్యాయ సాధికార సంస్థ కార్యదర్శి కె.జయలక్ష్మి, జేసీఐ అధ్యక్షులు డి.సంతోష్‌, కార్యదర్శి ఆర్‌.బేగం, ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు.