పట్టభద్రుల ఎన్నికకు సిద్ధం కావాలి

ABN , First Publish Date - 2020-09-25T07:49:18+05:30 IST

పట్టభద్రుల ఎన్నికకు ప్రజాప్రతినిధులు, నాయకులు సిద్ధంకావాలని మంత్రి జగదీ్‌షరెడ్డి పిలుపునిచ్చారు

పట్టభద్రుల ఎన్నికకు సిద్ధం కావాలి

 మంత్రి జగదీ్‌షరెడ్డి 


మర్రిగూడ, చండూరు, సెప్టెంబరు 24: పట్టభద్రుల ఎన్నికకు ప్రజాప్రతినిధులు, నాయకులు సిద్ధంకావాలని మంత్రి జగదీ్‌షరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మర్రిగూడ, చండూరులో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, నాయకులు పట్టభద్రుల వద్దకు వెళ్లి వారు ఓటర్‌గా నమోదుచేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించాలన్నారు. డిగ్రీ పూర్తి చేసిన వారిని గుర్తించి జాబితా రూపొందించాలని, అక్టోబరు 1 నుంచి ఓట రు నమోదు ప్రక్రియ చేయించాలని సూచించారు. రాష్ట్రంలో ఏ ఎన్నికైనా టీఆర్‌ఎ్‌సదే విజయమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టకపోగా, పెద్దనోట్ల రద్దుతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. పూటకో కాంగ్రెస్‌ నాయకుడు మైకు ముందుకు వచ్చి కుప్పిగంతులు వేస్తున్నారని, వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ రెండు పార్టీలను ప్రజలు విశ్వసించడంలేదని అన్నారు. 


సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, జడ్పీటీసీలు పాశం సురేందర్‌రెడ్డి, కర్నాటి వెంకటేశం, నారబోయిన స్వరూపారాణి, ఎంపీపీలు మెండు మోహన్‌రెడ్డి, ఏడుదొడ్ల శ్వేత రవీందర్‌రెడ్డి, కర్నాటి స్వామి, టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్‌రెడ్డి మర్రిగూడ, నాంపల్లి, చండూరు, మునుగోడు మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షులు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-25T07:49:18+05:30 IST