విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

ABN , First Publish Date - 2021-11-28T05:06:29+05:30 IST

విద్యతో పాటు క్రీడ పోటీల్లో రాణించాలని ఆర్మూర్‌ ఏసీపీ రఘు అన్నారు. మామిడిపల్లిలోని సెయింట్‌పాల్‌ హై స్కూల్‌ క్రీడా మైదానంలో శనివారం రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్‌ బాలబాలి కల బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలను ఆర్మూర్‌ ఏసీపీ రఘు ప్రారంభించారు.

విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
మాట్లాడుతున్న ఏసీపీ రఘు

ఆర్మూర్‌రూరల్‌, నవంబరు 27: విద్యతో పాటు క్రీడ పోటీల్లో రాణించాలని ఆర్మూర్‌ ఏసీపీ రఘు అన్నారు. మామిడిపల్లిలోని సెయింట్‌పాల్‌ హై స్కూల్‌ క్రీడా మైదానంలో శనివారం రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్‌ బాలబాలి కల బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలను ఆర్మూర్‌ ఏసీపీ రఘు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో బాల్‌బ్యాడ్మింటన్‌ జి ల్లా అధ్యక్షుడు మానస గణేష్‌, ప్రధానకార్యదర్శి శ్యామ్‌, జిల్లా క్రీడాధికారి ముత్తెన్న, ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి మోహన్‌, విద్యాసాగర్‌రెడ్డి పాల్గొన్నారు.  మామిడిపల్లిలో నిర్వహిస్తున్న సబ్‌జునియర్‌ రాష్ట్రస్థాయిబాలబాలికల పో టీలలో వివిధ జిల్లాల జట్లు పుల్‌-1, పుల్‌-బి విభాగాల్లో తలపడ్డాయి. నిజా మాబాద్‌ బాలికల జట్టు క్వార్టర్‌ ఫైనాల్‌లో వరంగల్‌ జిల్లా జట్టుపై విజ యం సాధించి సెమిఫైనల్‌లో ప్రవేశించాయి. బాలుర విభాగంలో పుల్‌-ఏ లో విభాగంలో లీగ్‌ మ్యాచ్‌లో రంగారెడ్డి జట్టు నల్గొండ జట్టుపై 35-21, 35-21 స్కోర్‌తో విజయం సాధించగా కరీంనగర్‌ జట్టు మహబూబ్‌నగర్‌గా రంగారెడ్డి జట్టు మహబూబ్‌నగర్‌పై, నల్గొండ జట్టు మహబూబ్‌నగర్‌పై, కరీంనగర్‌ జట్టు నిజామాబాద్‌పై, నిజామాబాద్‌ జట్టు మహబూ బ్‌నగ ర్‌పై, కరీంనగర్‌ జట్టు నల్గొండ జట్టుపై విజయం సాధించారు. పుల్‌- బిలో మెదక్‌ జట్టు ఆదిలాబాద్‌పై, వరంగల్‌ జట్టు ఖమ్మంపై, ఆదిలాబాద్‌ జట్టు ఖమ్మంపై, మెదక్‌ జట్టు ఖమ్మంపై విజయం సాధించాయి.
జాతీయస్థాయి రోడ్‌ సైక్లింగ్‌ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపిక
సుభాష్‌నగర్‌: జాతీయస్థాయిలో ఈ నెల 25 నుంచి 28 వరకు సైక్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా హర్యానా సైక్లింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయస్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికైనట్లు సైక్లిం గ్‌ సంఘ సెక్రెటరి విజయ్‌కాంత్‌రావు తెలిపారు. హర్యానాలోని కురుక్షేత్రలో జరగనున్న ఈ పోటీలకు కామిశెట్టి యశ్వంత్‌కుమార్‌, జీఆర్‌.సమీర్‌, ఏఆర్‌రాఘవేంధర్‌లు ఎన్నికయ్యారన్నారు. ఒలంపిక్‌ సంఘం అధ్యక్షుడు రాములు, సైక్లింగ్‌ సంఘ అధ్యక్షుడు కృపాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు సూర్యప్రకాష్‌, సురేందర్‌, నర్సింగ్‌, తదితరులు అభినందనలు తెలిపారు.
ప్రారంభమైన అండర్‌ఆర్మ్‌ క్రికెట్‌ పోటీలు
తెలంగాణ అండర్‌ఆర్మ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం క్రికెట్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. జడ్పీ దాదన్నగారి విఠల్‌, జిల్లా ఒలంపి క్‌ అధ్యక్షుడు గడిల రాములు, అండర్‌ఆర్మ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సౌత్‌ ఇం డియా కన్వీనర్‌ అలుక కిషన్‌లు పోటీలు ప్రారంభించారు.

Updated Date - 2021-11-28T05:06:29+05:30 IST