విద్యతోపాటు క్రీడల్లో రాణించాలి

ABN , First Publish Date - 2021-03-09T06:54:35+05:30 IST

విద్యార్థులకు విద్యతోపాటు క్రీడల్లో రాణించినప్పుడే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అన్నారు.

విద్యతోపాటు క్రీడల్లో రాణించాలి
పెన్సింగ్‌ పోటీలకు ఎంపికైన విద్యార్ధిని అభినందిస్తున్న ఎమ్మెల్యేబూడిముత్యాలనాయుడు



ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు

దేవరాపల్లి, మార్చి 8: విద్యార్థులకు విద్యతోపాటు క్రీడల్లో రాణించినప్పుడే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అన్నారు.  జాతీయస్థాయి ఫెన్సింగ్‌ పోటీలకు అర్హత సాధించిన చీడికాడ మండలం జి.కొత్తపల్లికి చెందిన కొల్లి గౌరీశంకర్‌ను సోమవారం ఎమ్మెల్యే అభినందించారు. కాకినాడలో గత నెల 27 నుంచి ఈనెల 1వ తేదీ వరకు రాష్ట్రస్థాయి అంతర్‌ జిల్లాల ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో విశాఖ జిల్లా తరుపున గోల్డ్‌మెడల్‌ సాధించారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రం రుద్రపూర్‌లో ఈనెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నిర్వహించే జాతీయ స్థాయిలో ఫెన్సింగ్‌ పోటీలలో శంకర్‌ పాల్గొంటున్నట్టు కోచ్‌ బండారు అశోక్‌ తెలిపారు. గౌరీశంకర్‌తోపాటు అతని తండ్రి వెంకటరావు, కుటుంబ సభ్యులు కూడా ఎమ్మెల్యేను కలిశారు. 


Updated Date - 2021-03-09T06:54:35+05:30 IST