చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

ABN , First Publish Date - 2021-10-25T06:13:19+05:30 IST

ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని రామన్నపేట అడిషనల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కలిదిండి తులసిదుర్గారాణి తెలిపారు. న్యాయసేవలు-అవగాహనపై వలిగొండ, లింగరాజుపల్లి పొద్దటూరు గ్రామాల్లో ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
సమావేశంలో మాట్లాడుతున్న అడిషనల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ తులసి దుర్గారాణి

వలిగొండ/తుర్కపల్లి, అక్టోబరు 24: ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని రామన్నపేట అడిషనల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కలిదిండి తులసిదుర్గారాణి తెలిపారు. న్యాయసేవలు-అవగాహనపై వలిగొండ, లింగరాజుపల్లి పొద్దటూరు గ్రామాల్లో ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెజిస్ర్టేట్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇసుక  అక్రమ దందాను నియంత్రించాలన్నారు. న్యాయం దృష్టిలో అందరూ సమానులేనని అన్నారు. ప్రజలకు న్యాయవవస్థ రక్షణ గా ఉంటుందన్నారు. నవంబరు 14వ తేదీ వరకు చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.  ఫ్రెండ్లీ పోలీస్‌ వ్యవస్థ సమర్థవంతంగా పని చేస్తోందన్నారు. వృద్ధులు, మహిళల హక్కులు, గృహ హింస తదితర అంశాలపై అవగాహన కల్పించారు. బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో రామన్నపేట బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మద్దెల శ్రీనివా్‌సగౌడ్‌, ఎంపీపీ నూతి రమే్‌షరాజు, సర్పంచ్‌లు, బోళ్ల లలిత, బొడ్డుపల్లి ఉమా, గరిసె నర్సమ్మ, తహసీల్దార్‌ నాగలక్ష్మి, రామన్నపేట సీఐ మోతీరాం, ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్‌, ఎంపీటీసీ పల్లె ర్ల భాగ్యమ్మ, ఉపసర్పంచ్‌ మత్స్యగిరి, అడ్వకేట్లు ఎండీ.మజీద్‌, బాలరాజుగౌడ్‌, డెవిడ్‌, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. తుర్కపల్లి మండలంలోని వేల్పుపల్లిలో న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఉచిత న్యాయసలహాలు, ఉచిత న్యాయసేవలు, చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పారాలీగల్‌ వలంటీర్‌ పబ్బ రష్మిత, ప్యానల్‌ లీగల్‌ అడ్వకేట్‌ పిడుగు అయిలయ్య, వీఆర్‌ఏ బరిగె నర్సింహ, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-25T06:13:19+05:30 IST