Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చాలిడిచ్‌పల్లి, నవంబరు 27: విద్యా ర్థులు చదువుతో పాటు క్రీడల్లో కూ డా రాణించాలని, ఏ స్థాయిలో ఆడి నా ఉత్తమ ప్రదర్శన కనబర్చాలని జిల్లా విద్యా శాఖాధికారి దురా ్గప్రసాద్‌ అన్నారు. డిచ్‌పల్లి మండ లం సుద్దపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల క్రీడా మైదానం లో సాఫ్ట్‌బాల్‌ జిల్లా బాలికల జట్లు శిక్షణ ముగింపు కార్యక్రమానికి హా జరయ్యారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ... ఆట ల ద్వారా విద్యార్థుల మధ్య స్నేహ భావం పెంపొందుతుం దన్నారు. క్రీడల్లో పాల్గొనే విద్యార్థులకు ఆరోగ్యంగా, మాన సికంగా, శారీ రకంగా అభివృద్ధి సాధించగలుగతారన్నారు. ఈ నెల 27 నుంచి 29 వరకు జగిత్యాలలో నిర్వహించను న్న సబ్‌ జూనియర్‌ రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్టు ప్రఽథమ స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయి పోటీ లకు ఎంపికైన మిట్టాపల్లి విద్యార్థులు గంగజమున, గంగాధర్‌లను డీఈవో అభినందించారు. పోటీల్లో అత్యు త్తుమ ప్రతిభకనబరిచి జిల్లా మంచి పేరు తీసుకురావాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ గోదావరి, సాఫ్ట్‌ బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు ప్రభాకర్‌ రెడ్డి, గంగామోహన్‌, సీనియర్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌, జూనియర్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ కల్పన, సాఫ్ట్‌ బాల్‌ అసోసియేషన్‌ జిల్లా సంయుక్త కార్యదర్శి సుజాత, వ్యాయామ ఉపాధ్యాయులు లత, మౌనిక, సంతో ష్‌, గంగామోహన్‌, సాఫ్ట్‌ బాల్‌ అకాడమీ కోచ్‌ అనికేత్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement