దేశ సమగ్రతకు పాటుపడాలి

ABN , First Publish Date - 2021-06-24T04:25:11+05:30 IST

దేశ సమగ్రతకు పాటుపడాలి

దేశ సమగ్రతకు పాటుపడాలి
చౌదరిగూడ : నివాళులర్పిస్తున్న నాయకులు

  • ఘనంగా శ్యాంప్రసాద్‌ ముఖర్జీ బలిదాన్‌ దివస్‌ 
  • చిత్రపటాలకు నివాళులర్పించిన బీజేపీ నాయకులు


ఆమనగల్లు/కడ్తాల్‌/తలకొండపల్లి/కొత్తూర్‌/చౌదరిగూడ/ కేశంపేట: భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకులు, స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ ముఖర్జీ బలిదాన్‌ దివస్‌ కార్యక్రమాన్ని ఆమనగల్లులో బుధవారం ఘనంగా జరుపుకున్నారు. శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై రాజీవ్‌ చౌక్‌ వద్ద బీజేపీ మున్సిపల్‌ కన్వీనర్‌ సుండూరు శేఖర్‌ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు శ్యాంప్రసాద్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణంలో పలుసేవా కార్యక్రమాలునిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కండె హరిప్రసాద్‌, జిల్లా కార్యదర్శి గోరటి నర్సింహ, శేఖర్‌ మాట్లాడుతూ ముఖర్జీ పోరాట స్ఫూర్తిని, ధైర్య సాహసాలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ దేశ సమగ్రత కోసం పాటుపడాలన్నారు. దేశ సమైక్యత కోసం ప్రాణాలర్పించిన ధీరుడు ముఖర్జీ అని వారు కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు చెక్కాల లక్ష్మణ్‌, విజయ్‌కృష్ణ, విక్రమ్‌ రెడ్డి, చెన్నకేశవులు, శ్రీకాంత్‌సింగ్‌, తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కడ్తాల మండల అధ్యక్షుడు మన్యనాయక్‌ ఆధ్వర్యంలో బలిదాన్‌ దివస్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి బ్రహ్మచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భగీరథ్‌, జిల్లా గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి సాయిలాల్‌ పాల్గొన్నారు. ముఖర్జి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జన్‌సం్‌ఘ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్‌ ముఖర్జీ 68వ వర్ధంతిని కొత్తూర్‌ మున్సిపాలిటీ పరిధి తిమ్మాపూర్‌లో ఘనంగా నిర్వహించారు. బీజేపీ నాయకులు ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అమడపురం నర్సింహగౌడ్‌, నాయకులు  ఏనుగు సుధాకర్‌రెడ్డి, రణధీర్‌గౌడ్‌, రాఘవేందర్‌రెడ్డి, శ్రీశైలం పాల్గొన్నారు. చౌదరిగూడ మండల కేంద్రంలోని శివాజీ చౌరస్తాలో శ్యాంప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతిని బుధవారం బీజేపీ మండల అధ్యక్షుడు కొనేరి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కురుమయ్య, సురేష్‌, మరళి, తదితరులు పాల్గొన్నారు. కేశంపేట మండల కేంద్రంలో శ్యాంప్రసాద్‌ ముఖర్జీ చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కిసాన్‌ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మోటే శ్రీనివాస్‌, బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శివాజీ, హరికృష్ణ, మలేష్‌, యాదయ్య, శ్రీను, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

ముఖర్జీ ఆశయ సాధనకు కృషి 

యాచారం: భారతీయ జన్‌సం్‌ఘ వ్యవస్థాపకులు డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ ముఖర్జీ ఆశయ సాధనకు యువత పాటుపడాలని బీజేపీ యాచారం మండల అధ్యక్షుడు తాండ్ర రవి అన్నారు. బుధవారం బలిదాన్‌ దివస్‌ సందర్భంగా ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు ముంత జంగయ్యయాదవ్‌, కె.రామనాధంగుప్తా, జి.శ్రీధర్‌గౌడ్‌, శ్రీనివా్‌సగుప్తా, కార్తిక్‌, దయాకర్‌, నడికూడి కృష్ణ తదితరులున్నారు. 

శ్యాంప్రసాద్‌ ముఖర్జీని ఆదర్శంగా తీసుకోవాలి

మొయినాబాద్‌ : మహోన్నత వ్యక్తి శ్యాంప్రసాద్‌ ముఖర్జీ అని ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాశ్‌ అన్నారు. బుధవారం శ్యాంప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకుని బీజేపీ నాయకులు ఆయన చిత్రపటం వద్ద ఘనంగా నివాళి ఆర్పించారు. కార్యక్రమంలో కిసాన్‌ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి, మండల అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు జ్ఞానేశ్వర్‌, ఓబీసీ జిల్లా అధికార ప్రతినిధి మోకిలా వెంకటేశ్‌, దళిత మోర్చా మండల అధ్యక్షుడు వెంకటేశ్‌, మండల ప్రధాన కార్యదర్శి రాజామల్లేశ్‌, మహేందర్‌, నాయకులు రమేశ్‌, శేఖర్‌గౌడ్‌, వీరారెడ్డి, తదితరులున్నారు. 

Updated Date - 2021-06-24T04:25:11+05:30 IST