సమన్వయంతో పని చేయాలి

ABN , First Publish Date - 2022-06-01T04:01:21+05:30 IST

జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు.

సమన్వయంతో పని చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

- కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌, మే 31: జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు.  కలెక్టరేట్‌లో మంగళవారం అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, ఏఎస్పీ అచ్చేశ్వర్‌రావుతో కలిసి అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. ఐదో విడత పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా జూన్‌ 3 నుంచి 18 వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నామని చెప్పారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలన్నారు. జిల్లాలో 36 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా గుర్తించి ప్రతి గ్రామపంచాయతీకి ఒక ప్రత్యేక అధికారిని నియమించామని చెప్పారు.  అధికారులు పల్లె నిద్ర కార్యక్ర మాన్ని నిర్వహించాలని అన్నారు. బాల్య వివాహల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ప్రతీ గ్రామానికి త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జూన్‌ 2 రాష్ట్ర అవతరణ సందర్భంగా ఉదయం 9 గంటలకు కలెక్టరేట్‌ భవన ప్రాంగణంలో వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని అన్నారు.. సాయంత్రం నాలుగు గంటలకు కవి సమ్మేళనం ఉంటుం దని తెలిపారు.  సమావేశంలో అయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-01T04:01:21+05:30 IST