గ్రామాభివృద్ధే ధ్యేయంగా పని చేయాలి : ఎంపీపీ

ABN , First Publish Date - 2021-10-26T07:02:18+05:30 IST

గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని మండల పరిషత్‌ అధ్యక్షురాలు సుంకర సునీత అన్నారు.

గ్రామాభివృద్ధే ధ్యేయంగా పని చేయాలి : ఎంపీపీ
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ సుంకర సునీత

ముండ్లమూరు, అక్టోబరు 25 : గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని మండల పరిషత్‌ అధ్యక్షురాలు సుంకర సునీత అన్నారు. సోమవారం స్థానిక విద్యావనరుల కేంద్రంలో ఉప సర్పంచ్‌లు, పంచాయతీ వార్డుసభ్యుల శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణకు ముఖ్య అతిథిగా ఎంపీపీ సునీత హాజరై మాట్లాడారు. నూతనంగా ఎన్నికైన ఉపసర్పంచ్‌లు, వార్డుసభ్యులు, వారి పరిధిలోని పంచాయతీకి కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలన్నారు. అధికారులు శిక్షణలో ఇచ్చే సూచనలు, సలహాలు పాటించి గ్రామాభివృద్ధికి పాటు పడాలన్నారు. ప్రధానంగా పంచాయతీల్లో పారిశుధ్యం లోపించ కుండా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు గ్రామంలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు రావాలన్నారు. ప్రధానంగా గ్రామాల్లో వీధి లైట్లు ఎప్పటికప్పుడు వెలిగేలా చూడాలన్నారు. విష జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు ప్రబల కుండా ఉండే విధంగా చూడాలన్నారు. పచ్చదనం, పరిశుభ్రత గ్రామాల్లో పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బీ.చంద్రశేఖరరావు, జెడ్పీటీసీ తాతపూడి రత్నరాజు, మారెళ్ల సొసైటీ అధ్యక్షుడు సుంకర బ్రహ్మానందరెడ్డి, ఎంపీడీవో బీ.చంద్రశేఖరరావు, ఈవోఆర్‌డీ ఓబులేసు, ట్రైనర్స్‌ హనుమంతరావు, శ్రీనివాసరావు, ప్రసన్నకుమార్‌, మధుబాబు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-10-26T07:02:18+05:30 IST