Abn logo
Sep 27 2021 @ 00:43AM

నాలుగు మండలాల్లో ముసురు

తుఫాన్‌ కారణంగా కోటవురట్లలో వర్షం కురుస్తున్న దృశ్యం

  తుఫాన్‌ ప్రభావంతో మారిన వాతావరణం

  స్తంభించిన జన జీవనం

పాయకరావుపేట/ఎస్‌.రావరం/నక్కపల్లి/కోటవురట్ల, సెప్టెంబరు 26: తుఫాన్‌ ప్రభావం కారణంగా నియోజకవ ర్గంలోని నాలుగు మండలాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచి ముసురు వాతావరణం నెలకొంది. రాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో పాయకరావుపేట పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, మెయిన్‌ రోడ్డుపై గోతుల్లో వర్షపు నీరు చేరడంతో వాహనచోదకులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నక్కపల్లి, ఎస్‌.రాయవరం మండలాల్లోనూ ఇదే వాతా వరణం నెలకొంది. ఈ ప్రాంతాల్లోని సముద్ర తీర ప్రాంతాల్లో పరిస్థితులను అధికార యం త్రాగం ఎప్పటికప్పుడు పర్యవేక్షి స్తు న్నారు. ఇరు పోలీస్‌ స్టేషన్ల ఎస్‌ఐలు సిబ్బం దితో అనుక్షణం అప్రమత్తంగా ఉన్నారు. ఇదిలా వుంటే, కోటవురట్ల మండలంలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడ చూసి నా నీరే కనిపించింది. కొన్నిచోట్ల డ్రైనే జీలు పూడుకు పోవడంతో మురుగు రోడ్లపైకి చేరింది. టి.జగ్గపేట, బోడపాలెం, అణుకు  మట్టిరోడ్లు బుదరమాయంగా మారాయి.