‘ఏడాది’పాటు... వాట్సాప్ ‘మ్యూట్’...

ABN , First Publish Date - 2020-10-30T20:47:44+05:30 IST

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఆధ్వర్యంలోని వాట్సాప్‌లో ‘ఆల్వేస్ మ్యూట్’ ఆప్షన్ ఐవోఎస్, ఆండ్రాయిడ్ వర్షన్‌లలో అందుబాటులోకొచ్చింది. ఎనిమిది గంటలు, ఒక వారం లేదా ఆల్వేస్ మ్యూట్ ఆప్షన్ వచ్చింది. గతంలో ఆల్వేస్ మ్యూట్ స్థానంలో ఒక ఏడాది (ఇది గరిష్టం) కాలపరిమితి ఉండేది.

‘ఏడాది’పాటు... వాట్సాప్ ‘మ్యూట్’...

న్యూయార్క్ :  సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఆధ్వర్యంలోని వాట్సాప్‌లో ‘ఆల్వేస్ మ్యూట్’ ఆప్షన్ ఐవోఎస్, ఆండ్రాయిడ్ వర్షన్‌లలో అందుబాటులోకొచ్చింది. ఎనిమిది గంటలు, ఒక వారం లేదా ఆల్వేస్ మ్యూట్ ఆప్షన్ వచ్చింది. గతంలో ఆల్వేస్ మ్యూట్ స్థానంలో ఒక ఏడాది (ఇది గరిష్టం) కాలపరిమితి ఉండేది. ఇప్పుడు ఏడాదికి బదులు ఈ కొత్త ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. 'ఇక నుండి మీరు ఎప్పటికీ మ్యూట్ చేయవచ్చు' అనంటూ ఫేస్‌బుక్ ట్వీట్ చేసింది. 


మ్యూట్ చేయడమిలా...  వాట్సాప్ లో ఏ గ్రూప్‌నైతే ఎప్పటికీ మ్యూట్ చేయాలని భావిస్తున్నారో ఆ గ్రూప్‌ను ఓపెన్ చేయాలి. గ్రూప్ పేరు పైన ట్యాప్ చేయండి. గ్రూప్ పేరుకు క్రింద మ్యూట్ ఎంపిక ఉంటుంది. అక్కడ మ్యూట్ పైన క్లిక్ చేయాలి. అక్కడ మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఎనిమిది గంటలు, ఒకవారం, ఆల్వేస్ మ్యూట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇప్పటి వరకు ఆల్వేస్ మ్యూట్ స్థానంలో ఏడాది ఉంది. వీటిలో అవసరం మేరకు ఎంపిక చేసుకోవచ్చు. 

Updated Date - 2020-10-30T20:47:44+05:30 IST