Abn logo
Sep 27 2021 @ 00:07AM

పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టిన దొంగల ముఠా ?

కళ్యాణదుర్గం, సెప్టెంబరు26: ఓ దొంగల ముఠా శనివారం అర్ధరాత్రి దాటాక పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన సంఘటన కళ్యాణదుర్గం ప్రాంతంలో జరిగింది.  కర్ణాటక ప్రాంతం నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత కళ్యాణదుర్గంలోకి అనుమానాస్పదస్థితిలో ఓ వాహనం ప్రవే శించింది. పోలీసులు తనిఖీ చేయడానికి ప్రయత్నించగా ఆ వాహనాన్ని మరో దారి వెంబడి మళ్లించారు. పోలీసులు అప్రమత్తమై ఉన్నతాధికారులతో కలిసి తప్పించు కుపోతున్న వాహనాన్ని వెంబడించారు. పోలీసులు వెంట పడటంతో  పలు ప్రాంతాల్లో తీవ్రంగా తిరిగిన తర్వాత మండల పరిధిలోని పాలవాయి గ్రామం పం టపొలాల్లో  గుంతలో వాహనం ఇరుక్కుపోయింది. దీంతో అందులో ఉన్న దొంగల ముఠా పారిపోయింది. ఆ వాహనంలో దొంగలు ధరించే వివిధ రకాల దుస్తులు, మారణాయుధాలతో పాటు రెండు ఆవులు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఉదయాన్నే పోలీసులు గుంతలో ఉన్న లారీని  గ్రామంలోని రైతుల సాయంతో బయటకుతీసి పోలీస్‌ స్టేషనకు తరలించారు. రా త్రంతా పోలీసులు నానా తంటాలు పడ్డారు. ఉత్తరభారత దే శానికి చెందిన ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. స్వా ధీనం చేసుకున్న రెండు ఆవుల్లో ఒక ఆవుకు బీమాకు సంబంధించిన ట్యాగ్‌ ఉండటంతో దాని ఆధారంగా ఎక్కడ దొంగలించబడిన విషయం గుర్తించగలిగామని పోలీసులు తెలిపారు.