నకిలీ బంగారు నాణేల ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2022-01-20T06:13:13+05:30 IST

నకిలీ బంగారు నాణేలతో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అనంతపురం రూరల్‌ పోలీసులు అరె స్టు చేశారు.

నకిలీ బంగారు నాణేల ముఠా అరెస్టు

రూ.10 లక్షల నగదు, కారు, బైక్‌, మూడు సెల్‌ఫోన్ల స్వాధీనం

అనంతపురం క్రైం, జనవరి 19: నకిలీ బంగారు నాణేలతో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అనంతపురం రూరల్‌ పోలీసులు అరె స్టు చేశారు. పట్టుబడిన  ముగ్గురి నుంచి రూ.10లక్షల నగదు, కారు, ద్విచక్రవాహనం, మూడు సెల్‌ఫోన్లను స్వాధీ నం చేసుకున్నారు. ఆ వివరాలను అనంతపురం సబ్‌ డివిజన ఇనచార్జి డీఎస్పీ ప్రసాదరెడ్డి స్థానిక రూ రల్‌ పోలీసుస్టేషనలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కర్ణాటకలోని దావణగెరె జిల్లాలోని మాచెహళ్లి గ్రామానికి చెందిన విజయ్‌కుమార్‌, కేజే అశోక్‌, దివాకర్‌ అలియాస్‌ కుమార్‌ స్నేహితులు. వీరు తాగుడు తదితర వ్యసనాలకు బానిసలయ్యారు. ఈ క్రమంలో సులువుగా డబ్బు సంపాదించి వ్యసనాలకు తీర్చుకునేందుకు పథకం వేశారు. పొలం, ఇళ్ల పునాదులు తవ్విన సమయంలో బంగారు నాణేలు దొరికాయని ప్రజలను నమ్మించేవారు. ఇదే క్రమంలో గుర్తు తెలియని ఫోన నెంబర్లకు ఫోన చేసి, బంగారు నాణేలను తక్కువ ధరకు ఇస్తామని నమ్మబలికి కర్ణాటక తదితర ప్రాంతాల వాసులను మోసం చేశారు. వచ్చిన సోమ్ముతో జల్సాలు తీర్చుకున్నారు. కొన్ని రోజుల కిందట తెలంగాణలోని నల్గొండ జిల్లా బాజకుంట గ్రామానికి చెందిన రైతులు పరమేష్‌, మహే్‌షకు ఫోన చేసి, నమ్మించారు. వీడియో కాల్‌ చేసి చూపించడంతో సదరు రైతులు కూడా నమ్మేశారు. దీంతో వారి పథకం ప్రకారం ఈనెల 14వ తేదీన అనంతపు రం రూరల్‌ మండలం కురుగుంటలోని వైఎ్‌సఆర్‌ కాలనీకి ఇరువురు చే రుకున్నారు. దీంతో ముఠా సభ్యులు తెచ్చిన నకిలీ బంగారు నాణేలను తె ల్లని గుడ్డ సంచిలో వేసి, రైతులకిచ్చారు. వెంటనే అక్కడికక్కడే ఇరువురి సమక్షంలో నాణేలు నకిలీవని గుర్తించారు. దీంతో అసలు విషయం తెలిసిపోయిందని ముఠా సభ్యులు భావించి, పరమేష్‌, మహేష్‌ చేతుల్లోని రూ.10 లక్షల నగదుతోపాటు మూడు సెల్‌ఫోన్లను లాక్కుని, ద్విచక్రవాహనంలో పరారయ్యారు. దీనిపై బాధితులు.. రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీఐ మురళీధర్‌రెడ్డి, ఎస్‌ఐలు నబీరసూల్‌, మహానంది, ఏఎ్‌సఐ వెంకటేష్‌, కానిస్టేబుళ్లు పోలా రమేష్‌, యు. రమేష్‌, జయకర్‌, కమల్‌బాషా, అనిల్‌, శేఖర్‌ బృందాలుగా ఏర్పడి, దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా బుధవారం నగర శివా వారులోని సీఆర్‌ఐటీ కళాశాల సమీపంలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి కారు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2022-01-20T06:13:13+05:30 IST