Advertisement
Advertisement
Abn logo
Advertisement

మటర్‌ పులావ్‌

కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్‌: ఓ కప్పు, పచ్చి బఠానీలు: ముప్పావు కప్పు, ఉల్లిముక్కలు: సగం కప్పు, నెయ్యి లేదా బటర్‌: మూడు స్పూన్లు, జీలకర్ర: స్పూను, దాల్చిన చెక్క: ఓ ముక్క, లవంగాలు: మూడు, బిర్యానీ ఆకులు: రెండు , నూనె, నీళ్లు, ఉప్పు: తగినంత


తయారుచేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యాన్ని బాగా కడిగి అరగంట పాటు నీళ్లలో నానబెట్టాలి. ప్రెషర్‌ కుక్కర్‌లో నూనె వేసి కాగాక జీలకర్రతో పాటు మసాలా దినుసులన్నీ వేసి కాస్త వేయించాలి. ఆ తరవాత ఉల్లిముక్కలు వేసి ఎర్రగా మగ్గేవరకు వేపాలి. పచ్చి బఠాణీలు వేసి ఓ నిమిషం పాటు వేయించాలి. దీనికి నీళ్లు ఒంపేసిన బాస్మతి బియ్యాన్ని వేసి బాగా కలపాలి. ఉప్పు కూడా వేయాలి. అవసరమైన మేరకు నీళ్లను పోసి కుక్కర్‌ మూతను పెట్టాలి. రెండు విజిల్స్‌ రాగానే దింపేస్తే వేడి వేడి మటర్‌ పులావ్‌ రెడీ.

వెజ్‌ కోఫ్తా బిర్యానీవెజ్‌ తెహ్రీకొత్తిమీర రైస్‌పైనాపిల్‌ పులావ్‌Mexican ఫ్రైడ్‌ రైస్‌ నరంజ్‌ పులావుపన్నీర్ పులావ్ (వీడియో) ప్రసాదం పులిహోరపాలకూర పలావ్‌జీడిపప్పు పులావ్‌
Advertisement