మ్యూచువల్‌ ఫండ్లు బ్యాంకులు కాదు: త్యాగి

ABN , First Publish Date - 2020-09-23T05:47:15+05:30 IST

మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు బ్యాంకులు కాదని, అవి బ్యాంకుల తరహాలో వ్యవహరించకూడదని సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి అ న్నారు.

మ్యూచువల్‌ ఫండ్లు  బ్యాంకులు కాదు: త్యాగి

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు బ్యాంకులు కాదని, అవి బ్యాంకుల తరహాలో వ్యవహరించకూడదని సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి అ న్నారు. కొన్ని ఎంఎఫ్‌ సంస్థలు ఇటీవ ల కాలంలో బ్యాంకుల తరహాలో కస్టమర్లకు మారటోరియం ఇస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల సంఘం (ఏఎంఎఫ్‌ఐ) సభ్యులనుద్దేశించి ప్రసంగిస్తూ డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లు పెట్టుబడికి, రుణానికి మధ్యన గల తేడాను గుర్తించాలని ఆయన  అన్నారు.


ఎంఎఫ్‌ సంస్థలకు బ్యాంకుల వలె నగదు నిల్వల నిష్పత్తి (సీఏఆర్‌) నిబంధనలేవీ లేవని, బ్యాంకులకు ఆర్‌బీఐ నిర్దేశించిన విధంగా రుణవితరణ బాధ్యతలు కూడా లేవని ఆయన గుర్తు చేశారు. రోజువారీ ఎన్‌ఏవీలను ప్రకటించడం ద్వారా ఇన్వెస్టర్ల విశ్వాసం పొందడమే వాటి బాధ్యత అన్నారు. అధిక శాతం ఇన్వెస్టర్లు ప్రస్తుతం 50 నగరాల్లోనే ఉన్నారని, ఎంఎ్‌ఫలు ఆ పరిధిని విస్తరించాలని కూడా సూచించారు. సెబీ ఏ ఒక్క కంపెనీని స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయాలని ఒత్తిడి చేయడంలేద ని త్యాగి అన్నారు.

ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే పోర్ట్‌ఫోలియోను కేటాయించుకోవచ్చునని ఆయన చెప్పారు. మల్టీ క్యాప్‌ ఎంఎ్‌ఫలు లార్జ్‌క్యాప్‌, మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌లలో 25ు వంతున ఇన్వెస్ట్‌ చేయాలంటూ ఇటీవల జారీ చేసిన నియమాలు కేవలం వాటి స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే జారీ చేశామన్నారు. 

Updated Date - 2020-09-23T05:47:15+05:30 IST