మెషీన్లు, ట్యూబుల మధ్య ఆ పసివాడు రోదిస్తుంటే....

ABN , First Publish Date - 2021-10-05T17:34:26+05:30 IST

యా... అల్లా... నేను గర్భవతినని తెలిసినప్పుడు కలిగిన ఆనందపు అనుభూతి అంతా ఇంతాకాదు. పుట్టబోయే బిడ్డకు ఏమేం చెయ్యాలో నేనెప్పుడూ కలగంటుండేదాన్ని. కానీ, వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది.

మెషీన్లు, ట్యూబుల మధ్య ఆ పసివాడు రోదిస్తుంటే....

"యా... అల్లా... నేను గర్భవతినని తెలిసినప్పుడు కలిగిన ఆనందపు అనుభూతి అంతా ఇంతాకాదు. పుట్టబోయే బిడ్డకు ఏమేం చెయ్యాలో నేనెప్పుడూ కలగంటుండేదాన్ని. కానీ, వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. నా ముద్దుల పసిపాపడు చాలా బలహీనంగా పుట్టాడు. ఇప్పుడు జీవన్మరణ పోరాటం చేస్తున్నాడు. మెషీన్లు, ట్యూబులకు అతుక్కుపోయి NICUలో ఉన్నాడు."... అంటూ రోదించింది తల్లి నూరీ.


నాకు బాబు పుట్టి వారం గడిచిందంతే. పిల్లవాడు పుట్టినప్పుడే ఏదో సమస్య ఉందని గ్రహించాను. వాడు ఏడవటం నేను విననేలేదు. నా బాబు గురించి అక్కడున్న నర్సులు విచారంగా మాట్లాడుకోవడం నేను విన్నాను. బాబు శ్వాస తీసుకోలేకపోవడాన్ని గమనించిన డాక్టర్లు వెంటనే పరీక్షించారు. ఆ తర్వాత.... "క్షమించండి మేడం. మీ అబ్బాయి ఒంట్లో కావలసినంత బలం లేదు. చాలా బలహీనంగా ఉన్నాడు. ప్రాణం నిలబడటానికి తనంత తానుగా శ్వాస తీసుకునే పరిస్థితుల్లో లేడు. పిల్లవాడికి మేము NICUలో IV ఫ్లూయిడ్స్, యాంటీబయాటిక్స్ ఇస్తున్నాం..." అని డాక్టర్లు చెప్పారు.


అల్లా.... నా చేతులతో నా ముద్దుల బాబును కనీసం ఎత్తుకోనైనా లేదు. నాకు వస్తున్న కన్నీటిని అపుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే నా కన్నీటిని నా కొడుకు చూడటం నాకు ఇష్టం లేదు. వాడిని ఇంటికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. నా కొడుకును కాపాడండి... దయచేసి సహాయం చెయ్యండి.


NICUలో ఇంకొంత కాలం చికిత్సనందించి వాడికి శక్తిమంతమైన జీవితాన్ని ఇవ్వాలంటే సుమారు రూ.18 లక్షలు ($ 10,854.82) ఖర్చవుతుందట.


నా భర్త ఎంతో మంచివాడు. దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. మేం డబ్బున్నవాళ్లం కాదు. ఆయన రోజుకు రూ.250 సంపాదిస్తాడు. కొన్ని రోజులు మాకు తిండి దొరకడమే కష్టం. మా పేదరికానికి నా కొడుకు జీవితాన్ని పణంగా పెట్టాలా?...జీవితం మాకొక పీడకలగా మారిపోయింది. ఒకపూట తిండికి కూడా సర్దుబాటు చేసుకోవడానికి కావలసినంత డబ్బు మా దగ్గర లేదు.


మా పసివాడు ఇదంతా అర్థం చేసుకునే పరిస్థితిలో లేడు. ఏదేమైనా సరే... వాణ్ణి వదలను. మమ్మల్ని వేరు చేసేది మృత్యువు మాత్రమే. ఇలా ఉహించడానికి కూడా నేను సాహసించలేకపోతున్నాను. వాడు నా కొడుకు... నా రక్తం.... నేను కోరుకున్నది వాడిని మాత్రమే...నా కొడుకును లాక్కుపోయేలా విధి ఎంతో క్రూరంగా మావైపు చూస్తోంది. ఇక నా కొడుకు ఎదుర్కుంటున్న శ్వాస సమస్యల్ని సరి చెయ్యవచ్చన్న డాక్టర్లు... ఇక చికిత్సను ఎంతమాత్రం ఆలస్యం చెయ్యకూడదని చెప్పారు.


సహాయం చేయడానికి ఈ లింక్ ను క్లిక్ చేయండి


ఈ పరిస్థితుల్లో మాకున్న ఏకైక ఆశ మీరు మాత్రమే. మా పసిప్రాణానికి ఇదే చివరి రోజేమో.... అన్న భయంతో ప్రతి రోజూ గుండె చెరువైపోతోంది. వాడు లేకుండా... నేను లేను. ప్రాణంతో పోరాడుతున్న తమ కొడుకు చికిత్సకయ్యే ఖర్చుల కోసం డబ్బులు సంపాదించేందుకు నూరి, ఫరూఖ్ దంపతులు నానా బాధలు పడుతున్నారు. దురదృష్టం వారిని వెన్నాడుతోంది. వారికున్న కొద్దిపాటి సంపాదన కాస్తా కరిగిపోయింది. ఇంకేమీ మిగల్లేదు.


ఆ పిల్లవాడికి వైద్య ఖర్చుల నిమిత్తం సుమారు రూ.18 లక్షలు ($ 10,854.82) అత్యవసరంగా కావాలి. బంధువులు, తెలిసినవారు అందరినీ డబ్బు కోసం ఆశ్రయించారు కానీ, ఫలితం లేకపోయింది.


ఆ నవజాత శిశువుకు చికిత్స కోసం దయచేసి మీరంతా సహకరించండి. మీ ఉదార హృదయపు అండతో ఆ తల్లిదండ్రులు వారి కన్న ప్రాణాన్ని నిలబెట్టుకుంటారు. ఈ పరిస్థితుల్లో వారికున్న ఆశ మీరు మాత్రమే. బాధతో ఆ పసివాడు రోదిస్తుంటే ఆ తల్లిదండ్రుల ధైర్యం సడలిపోతోంది. స్పందించాల్సిన సమయం చాలా తక్కువగా ఉంది...ఈ చిన్నారికి కొత్త జీవితాన్ని ఇచ్చేందుకు మీరంతా పెద్ద మనస్సుతో ముందుకు వచ్చి మీ శక్తిమేరకు విరాళాలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం.




Updated Date - 2021-10-05T17:34:26+05:30 IST