మా నిధులు మాకివ్వండి!

ABN , First Publish Date - 2021-11-28T06:18:43+05:30 IST

గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడాన్ని నిరసిస్తూ అమలాపురం మండల సర్పంచ్‌ల సమాఖ్య ఆధ్వర్యంలో శని వారం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

మా నిధులు మాకివ్వండి!
అమలాపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట సర్పంచ్‌లు ధర్నా చేస్తున్న దృశ్యం

 రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై సర్పంచ్‌ల ఆవేదన

 తమ నిధులు జమచేసి, గ్రామాలాభివృద్ధికి సహకరించాలని డిమాండు

 అమలాపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా

అమలాపురం రూరల్‌, నవంబరు 27: గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనుల కోసం  కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడాన్ని నిరసిస్తూ అమలాపురం మండల సర్పంచ్‌ల సమాఖ్య ఆధ్వర్యంలో శని వారం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అమలాపురం మండలానికి  సంబంధించి 22 గ్రామాలకు 15వ ఆర్థిక సంఘం కింద రూ.1,88,88,964 నిధులు విడుదల కాగా, మరుసటి రోజు నుంచి ఆన్‌లైన్‌లో ఆ మొత్తాలు కనిపించకుండా పోయాయని కొం దరు సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక సంఘం నిధు లను వెంటనే పంచాయతీ ఖాతాలకు తిరిగి జమచేసి గ్రామాల అభివృద్ధికి సహకరించా లంటూ నినాదాలు చేశారు. సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షురాలు నక్కా అరుణకుమారి ఆధ్వ ర్యంలో జరిగిన ఈ ధర్నాలో సమాఖ్య ప్రధాన కార్యదర్శి చొల్లంగి శివాళిని, ఉపాఽధ్యక్షుడు పొణకల గణేష్‌, కోశాధికారి రేలంగి దుర్గారావు మాట్లాడారు. అలాగే సర్పంచ్‌లు రాయుడు  వరలక్ష్మి, పందిరి విజయ, తిరుకోటి సుజాత, పెద్దిరెడ్డి రామచంద్రరావు, గానాల భారతి, చెల్లుబోయిన వెంకటేశ్వరరావు, కరాటం రత్నప్రసన్న, సత్తి నాగేశ్వరమ్మ, గంగుమళ్ల ఏసు బాబు, నక్కా రాజారత్ననాగవేణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాల యంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం కామనగరువులోని క్యాంపు కార్యాలయంలో మంత్రి పినిపే  విశ్వరూప్‌ను సర్పంచ్‌ల సమాఖ్య ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందిం చారు. సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. గతంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించాల్సి ఉందని, ప్రస్తుతం చెల్లించాల్సిన బిల్లులు ఎన్నో ఉన్నాయని, అటువంటి పరిస్థితుల్లో ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడంతో గ్రామాల అభివృద్ధికి అవరోధంగా మారిందని వారు మంత్రికి తెలిపారు. గ్రామాల అభివృద్ధికి  సహకరించాలని, ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు వెంటనే జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి విశ్వరూప్‌ హామీ ఇచ్చారు. 



Updated Date - 2021-11-28T06:18:43+05:30 IST