Advertisement
Advertisement
Abn logo
Advertisement

దాచుకున్నదంతా ఖర్చు చేశాం... మీరే కాపాడాలి

నా కొడుకు చిన్నారి రమేష్ నాకు దూరమైపోతున్నాడేమోనన్న ఆలోచన వస్తే చాలు, నాకు కన్నీరు ధారలై ఉబికి వస్తోంది. రోజు రోజుకూ వాడు నీరసించిపోతుంటే నేను చూస్తుండిపోయే పరిస్థితి వస్తుందని తలపులో సైతం ఎంతమాత్రం అనుకోలేదు. నా రమేష్‌ని ఆ క్యాన్సర్ వ్యాధి కబళించకుండా రక్షించండి.


పిల్లల్ని అధికంగా ప్రభావం చూపే lymphoblastic leukemia అనే ప్రాణాంతక బ్లడ్ క్యాన్సర్ ఐదేళ్ళ నా కొడుక్కి సోకింది. మా అబ్బాయిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడానికి కొద్దిరోజుల ముందు నుంచీ వాడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. డాక్టర్ దగ్గరకు వెళితే ఆ ఖర్చులు మేం భరించలేమన్న భయంతో ఇంటి దగ్గరే మా పిల్లాడిని కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశాను.

ఈ లింక్‌పై క్లిక్ చేసి ఈ అబ్బాయికి సాయం చెయ్యండి...

అయితే, వాడికి వచ్చిన అనారోగ్యం ఏదో మామూలు జ్వరమో, జలుబో కాదని నాకు త్వరలోనే అర్థమైంది. ఆస్పత్రిలో పరీక్షలు జరిపించిన తర్వాత మా అబ్బాయికి బ్లడ్ క్యాన్సర్ అని తెలిసింది. డాక్టర్ ఆ మాట చెప్పగానే నా కాళ్ల కింద భూమి కంపించిపోయింది. నా కొడుకు ఒక భయంకరమైన వ్యాధికి గురయ్యాడన్నది నేను నమ్మలేకపోయాను.


మా అబ్బాయిని కాపాడుకోవాలంటే అత్యవసరంగా చికిత్స చెయ్యాలి. కానీ, నేను గాని, నా భర్త ఆది గాని దానిని భరించే పరిస్థితిలో ఎంతమాత్రం లేము. రమేష్‌ని రక్షించుకోవాలంటే తనకు ప్రస్తుతం అవయవమార్పిడి జరిగి మెరుగైన వైద్యం అందాలి. అందుకు సుమారుగా రూ.20 లక్షలు ($26, 609.32) ఖర్చవుతుందట. ఈ ఖర్చును మేం ఎంతమాత్రం భరించలేం.

ఈ లింక్‌పై క్లిక్ చేసి ఈ అబ్బాయికి సాయం చెయ్యండి...

మా అబ్బాయికి ఈ భూమ్మీద 5 ఏళ్ల వయస్సుకే ఆయువు తీరే దుస్థితి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. మాకున్న విలువైన వస్తువులన్నీ అమ్మేశాం... దాచుకున్న సొమ్మంతా ఖర్చు చేశాం... తెలిసిన ప్రతి ఒక్కరి నుంచీ అప్పు చేశాం. దురదృష్టవశాత్తు ఇంత చేసినా మా అబ్బాయిని కాపాడుకోవడానికి అవసరమైనదేదీ చెయ్యలేకపోయాం.


అత్యవసరమైన చికిత్స ప్రారంభించకుండానే రోజులు గడిచిపోతుంటే మా అబ్బాయి నీరసించిపోతున్నాడు. మరోవైపు మా బాబుని కాపాడాలంటే వాడికి అత్యవసరంగా చికిత్స చెయ్యాలని.... లేకపోతే రమేష్ పరిస్థితి మరింత దిగజారిపోతుందని డాక్టర్లు మాతో అన్నారు. మేము డబ్బు సమకూర్చుకునే వరకూ రమేష్‌కి చికిత్స మొదలు కాదు. రమేషన్న ఎప్పుడు తిరిగివస్తాడని వాడి తమ్ముడు రోజూ అడుగుతున్నాడు. అన్నయ్యకు భయంకరమైన వ్యాధి సోకిందని చెప్పడానికి నాకు గుండెలు చాలడం లేదు. మేం కూడా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. 


ఈ లింక్‌పై క్లిక్ చేసి ఈ అబ్బాయికి సాయం చెయ్యండి...


రమేష్‌ని ఆస్పత్రిలో చేర్చి చికిత్స ప్రారంభించడం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాం... రోజులు గడిచిపోతున్నాయి. పాపం నా కొడుకు ఏడుస్తూ, భయపడుతూ... ఇంటికి తీసుకెళ్లమని మా కాళ్లావేళ్లా పడుతున్నాడు. మా అబ్బాయికి ఇప్పుడిప్పుడే జీవితం ప్రారంభమైంది... ఎంతో బాధను అనుభవిస్తున్నాడు. నా ప్రాణానికి ప్రాణమైన రమేష్‌ని కాపాడుకోవాలని తపన పడుతున్నాం... సమయం గడిచిపోతోంది. మీరందించే సహాయమే నా కొడుక్కి మిగిలిన ఏకైక ఆశ. దయచేసి సాయం చెయ్యండి

Advertisement
Advertisement

జాతీయం మరిన్ని...

చిత్రజ్యోతి మరిన్ని...