Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆపదలో భూలక్ష్మి... ఆదుకోవలసింది మీరే

నా కూతురే నాకు సర్వస్వం.... తను లేని జీవితాన్ని నేను కలలోనైనా ఊహించలేను. కష్టంలో ఉన్న మా అమ్మాయిని దయచేసి ఆదుకోండి....


మా అమ్మాయి రక్త సంబంధమైన ప్రమాదకర వ్యాధితో బాధపడుతోంది. అది ప్రాణాంతకమైంది. తనకు అత్యవసరంగా వైద్యం చెయ్యాలి. కానీ, అందుకయ్యే ఖర్చు భరించేంత స్తోమత నాకు లేదు. నా భర్త మద్యపానానికి అలవాటు పడ్డాడు. కుటుంబ పోషణకు ఎంతో కష్టపడ్డాను. కానీ, సంపాదించిన కాస్తంతా నా భర్త చెడు అలవాట్లకు కరిగిపోయింది. చివరికి, మా జీవితాలను ముక్కలు చేసి. మా బ్రతుకులకు కనీస ఆధారం ఏదీ మిగల్చకుండా మమ్మల్ని వదిలేసి నా భర్త ఎటో వెళ్లిపోయాడు. ఇంత జరిగినా నేను మాత్రం నా కూతురు భూలక్ష్మికి మంచి జీవితాన్ని అందించాలని పట్టుదలతో నిలబడ్డాను. మా అమ్మాయిని ఆనందంగా ఉంచడానికి చెయ్యగలిగిందంతా చేశాను.


నిజం చెప్పాలంటే, నన్ను ఎంతో అర్థం చేసుకునే ఇంత చక్కటి బిడ్డ కలగడం నా అదృష్టం. నాకెన్ని కష్టాలున్నా సరే, మా అమ్మాయి నవ్వు చూస్తే చాలు అవన్నీ మర్చిపోతాను. అమ్మాయి కోసమే నేను బతికున్నాను. పని కోసం నేను ఎన్నో చోట్ల వెదికాను. కానీ, నాకు దొరికిందల్లా రోజుకూలీ పని మాత్రమే. రోజుకు కేవలం రూ.200 ఆదాయంతో పూట గడవడానికి ఎంతో ఇబ్బంది పడుతూ మా అమ్మాయిని బడికి పంపించేదాన్ని. మా అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆశతోనే జీవితాన్ని నెట్టుకొస్తున్నాను. 


డొనేట్ చేయడానికి క్లిక్ చేయండి

కానీ, ఒక రోజున నా కూతురు స్పృహతప్పి పడి ఉండటం గమనించాను. వెంటనే మావాళ్ల సాయం తీసుకుని దగ్గర్లో ఉన్న క్లినిక్‌కి వెళ్లాను. అక్కడున్న డాక్టర్ గారు మా పాపాయిని చూసి బీపీ చాలా తక్కువగా ఉందన్నారు. ఇక సమయం వృధా కాకుండా ఇంకాస్తి పెద్ద ఆస్పత్రికి అమ్మాయిని తీసుకెళ్ళాను. అక్కడ మరిన్ని పరీక్షలు జరిగాక అమ్మాయి తీవ్రమైన aplastic anemiaకు గురైందని, ఇది ఒక ప్రాణాంతకమైన రక్త సంబంధ వ్యాధి అని తేలింది. నా గుండె చెరువైపోయింది. పాపాయి వైద్య ఖర్చులకు డబ్బు ఎలా సమకూర్చుకోవాలో అర్థం కాలేదు. కానీ, ఎలాగైనా గట్టెక్కాలని నిర్ణయించుకున్నాను.


సుమారు ఏడాది కాలంగా మా అమ్మాయికి ఆస్పత్రిలో రక్త మార్పిడి జరుగుతూ వచ్చింది. మా పాపాయికి చికిత్స కోసం మా చుట్టుపక్కలవారు, స్నేహితులు, బంధువులందరి దగ్గరా అప్పు చేశాను. ఖర్చులు భరించేందుకు మేముండే భూమిని కూడా అమ్మేసి దాదాపు రూ.16 లక్షలు ఖర్చు పెట్టాను. ఇప్పుడు డాక్టర్లు ఏమన్నారంటే... భూలక్ష్మిని కాపాడేందుకు bone marrow transplant చెయ్యాలని... ఇందుకు అదనంగా మరో రూ.30 లక్షలు ($ 39951.78) ఖర్చవుతుందని చెప్పారు.


ఇప్పుడు నేను తిండి లేక... ఉండేందుకు చోటు లేక... నా కూతురిని రక్షించుకునేందుకు ఆస్పత్రి బయటే వీధుల్లో ఉంటున్నాను. దురదృష్టం వెన్నాడి అప్పుల్లో కూరుకుపోయాను. నా కూతురి వైద్యానికయ్యే ఖర్చు భరించే పరిస్థితి లేదు. మా అమ్మాయిని దక్కించుకోవాలంటే ఇప్పుడు మీరే మాకు దిక్కు. తనే నాకున్న ఏకైక ఆస్తి. నా భూలక్ష్మి జీవితాన్ని కాపాడుకునేందుకు దయచేసి నాకు సాయం చెయ్యండి.

Advertisement
Advertisement

జాతీయం మరిన్ని...

చిత్రజ్యోతి మరిన్ని...