Abn logo
Jun 12 2021 @ 05:13AM

నా ఫేవరెట్‌ హీరో.. సల్మాన్‌

కరాచీ: బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌కు భారత్‌లోనే కాదు పాకిస్థాన్‌లోనూ విశేషంగా అభిమానులున్నారు. ఈ జాబితాలో ఆ దేశ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ కూడా ఉన్నాడు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మీ అభిమాన బాలీవుడ్‌ నటుడెవరు?’ అని అడిగిన ప్రశ్నకు అక్తర్‌ బదులిస్తూ ఈ కండల వీరుడి పేరు చెప్పాడు. అంతేకాకుండా ఈ పోస్ట్‌ను సల్మాన్‌కు ట్యాగ్‌ చేస్తూ షర్ట్‌ లేకుండా ఉన్న అతడి ఫొటోను జత చేశాడు. ఒకవేళ తన బయోపిక్‌ తీస్తే అందులో హీరోగా సల్మాన్‌ ఖాన్‌ నటిస్తే బాగుంటుందని అక్తర్‌ గతంలోనే చెప్పాడు.