నా ప్రేమ కొంత వైల్డ్‌గా ఉంటుంది: షోయబ్ అక్తర్

ABN , First Publish Date - 2020-08-06T04:47:59+05:30 IST

తన ప్రేమ కొంచెం క్రూరంగా ఉంటుందని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ చెప్పాడు.

నా ప్రేమ కొంత వైల్డ్‌గా ఉంటుంది: షోయబ్ అక్తర్

ఇస్లామాబాద్: తన ప్రేమ కొంచెం క్రూరంగా ఉంటుందని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ చెప్పాడు. తను ఎవర్నయినా ప్రేమిస్తే వారిని నెడుతూ, కొడుతూ మాట్లాడతానని తెలిపాడు. భారత క్రికెటర్లతో ఇలానే రెజ్లింగ్ చేసిన సందర్భాన్ని అక్తర్ గుర్తుచేసుకున్నాడు. ‘అది నా పద్ధతిలో ప్రేమ చూపించడం. కానీ ఆ సమయంలో హద్దు మీరాను. పొరబాటున యువరాజ్ వెన్నుకు గాయమైంది’ అని అక్తర్ తెలియజేశాడు. తాను ప్రేమను చూపించే విధానం కొంత వైల్డ్‌గా ఉంటుందని పేర్కొన్నాడు.

Updated Date - 2020-08-06T04:47:59+05:30 IST