Abn logo
Oct 24 2021 @ 07:31AM

Chennai: బాలికపై లైంగిక దాడి

                        - పోక్సో చట్టం కింద నిందితుడి అరెస్టు


అడయార్‌(Tamilnadu): నగర శివారు ప్రాంతానికి చెందిన 16 ఏళ్ళ బాలికను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. 16 ఏళ్ళ బాలిక ఈ నెల 18వ తేదీన వీధిలో ఉన్న ఓ దుకాణానికి వెళ్ళి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు ఎక్కడ గాలించినా కనిపించపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలిక ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులు జరిపిన విచారణలో 28 ఏళ్ళ వయస్సున్న విజయకుమార్‌ అనే యువకుడు ఈ బాలికను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి తన వెంట తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడినట్టు తేలింది. నిందితుడిని అరెస్టు చేసి, బాలికను రక్షించారు. ఆ తర్వాత నిందితుడిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. 


TAGS: Girl

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...