ద‌డ‌పుట్టిస్తున్న‌ కోవిడ్‌-19 కారు.... ఫిబ్ర‌వ‌రి నుంచి అక్క‌డే...

ABN , First Publish Date - 2020-07-16T17:12:51+05:30 IST

ప‌్ర‌స్తుత‌ 2020 సంవత్సరంలో ఎప్పుడు ఏమి జ‌రుగుతుందో ఎవ్వ‌రూ చెప్ప‌లేక‌పోతున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా విజృంభిస్తున్న త‌రుణంలో ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో క‌ల‌క‌లం రేపే ఘ‌ట‌న చోటుచేసుకుంది.

ద‌డ‌పుట్టిస్తున్న‌ కోవిడ్‌-19 కారు.... ఫిబ్ర‌వ‌రి నుంచి అక్క‌డే...

కెన్‌బెర్రా: ప‌్ర‌స్తుత‌ 2020 సంవత్సరంలో ఎప్పుడు ఏమి జ‌రుగుతుందో ఎవ్వ‌రూ చెప్ప‌లేక‌పోతున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా విజృంభిస్తున్న త‌రుణంలో ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో క‌ల‌క‌లం రేపే ఘ‌ట‌న చోటుచేసుకుంది.  మీడియాకు అందిన స‌మాచారం ప్ర‌కారం ఇక్కడి విమానాశ్రయం పార్కింగ్‌లో నిలిపివుంచిన‌ కారుకు గ‌ల‌ నంబ‌రు ప్లేటుపై కోవిడ్‌-19 అని రాసివుంది. క‌రోనా వైరస్ లాక్‌డౌన్‌కు ముందు నుంచి అడిలైడ్ విమానాశ్రయం పార్కింగ్‌ప్లేస్‌లో ఈ కారు నిలిపివుంది. ఈ కారుకు సంబంధించిన ఫొటోను విమానాశ్రయంలో పనిచేసే కార్మికుడు స్టీవెన్ స్ప్రీ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఈ కారు ఫిబ్రవరి నుంచి ఇక్కడే ఉంద‌ని తెలిపాడు. మొదట్లో ఈ కారుపై కవర్ ఉందని, ఆ త‌రువాత బ‌ల‌మైన గాలుల కారణంగా, కారుపై ఉన్న కవర్ కొద్దిగా ప‌క్క‌కి తొల‌గింద‌న్నారు. అప్పుడు కారు నంబ‌ర్ ప్లేట్‌పై కోవిడ్ 19 అని రాసివున్న విష‌యం బ‌య‌ట‌ప‌డింద‌న్నారు. ఈ కారు య‌జ‌మాని దీనిని ఇక్క‌డ నిలిపివుంచి, ఏ దేశానికో వెళ్లి, అక్క‌డ చిక్కుకుపోయి ఉంటాడ‌ని భావిస్తున్నామ‌ని స్టీవెన్ తెలిపారు. ఈ కారు ఎవ‌రిద‌నే దానిపై ఉన్న‌తాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-07-16T17:12:51+05:30 IST